రైతుల స్వెట్టర్ల కోసం కోటి ఇచ్చిన సింగర్

మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనకు మద్దతు ఇచ్చిన పంజాబ్ సింగర్ దిల్జిత్ దోసాంజ్ శనివారం ఢిల్లీ సరిహద్దులో జరిగిన నిరసనలో చేయి కలిపారు. వారి డిమాండ్లను నెరవేర్చాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అంతే కాకుండా రైతులకు చలిలో స్వెట్టర్ లు కొనడానికి గానూ ఆయన కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఆయన నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేసారు.Diljit Dosanjh has reportedly donated Rs 1 crore to buy warm clothes for farmers protesting against the three farm laws.

దిల్జిత్ దోసాంజ్ వైఖరిని ప్రశంసిస్తూ పంజాబీ గాయకుడు సింగా తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. శీతాకాలంలో రోడ్లపై నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల కోసం దుప్పట్లు మరియు ఇతర స్వెట్టర్ లు కొనసానికి రహస్యంగా రూ .1 కోట్లు విరాళంగా ఇచ్చాడని వెల్లడించారు. కోటి రూపాయలు ఇచ్చినా మీరు సైలెంట్ గా ఉన్నారు. ఈ రోజుల్లో పది రూపాయలు ఇచ్చినా సరే పది మందికి చెప్తారని ఆయన వ్యాఖ్యానించారు.