దాదాపు ఆరున్నర కోట్ల ఏండ్ల కిందట భూమి మీద తిరిగిన ఈ జంతువులు అంతరించిపోయి చాలా రోజులైంది. వీటి బొమ్మలు అక్కడక్కడా మ్యూజియాల్లో, అమ్యూస్మెంట్ పార్కుల్లో మాత్రమే కనిపిస్తాయి.అయితే… ‘జురాసిక్ పార్క్’ సినిమాలో చూసినట్టు పెద్ద పెద్ద డైనోసార్లని చూడాలంటే… చెన్నైలో జరిగే ఈ డైనోసార్ ఫెస్టివల్‌కి వెళ్లాలి.చెన్నైలో ఈనెల 10వ తారీఖు నుంచి డైనోసార్ ఫెస్టివల్ జరగనుంది. చెన్నై సెంటర్లో పది రోజులు జరిగే ఈ ఫెస్టివల్‌ని ‘డైనోసార్
ఫెస్టివల్ ఇండియా’ అనే సంస్థ నిర్వహిస్తోంది. ఇంతకుముందు ఢిల్లీ, ముంబైలో కూడా ఇలాంటి ఫెస్టివల్స్ జరిగాయి. అందరికి డైనోసార్లనిదగ్గరగా చూసిన ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వడమే ఈ ఫెస్టివల్ ఉద్దేశం. మనదేశంలో దాదాపు 16 రకాల డైనోసార్లు ఉండేవట. వాటిలో ఇసిసారస్, రాజసారస్, బ్రాచియోసారస్, టైరనోసారస్ రెక్స్, ట్రైసెరటాప్స్…. వంటి వాటిని ఇక్కడ చూడొచ్చు.
ఈ ఫెస్టివల్లో 20 మీటర్ల నుంచి 15 మీటర్ల ఎత్తు, 12 ఇంచుల పొడవు పళ్లు ఉన్న డైనోసార్ల బొమ్మలు ఉంటాయి. ఇక్కడికి వెళ్తే డైనోసార్ల మధ్య తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అంతేకాదు బొమ్మ డైనోసార్లతో ఫొటోలు దిగొచ్చు. పిల్లలు ఎంజాయ్ చేయడానికి శిలాజాలను వెలికితీసేయాక్టివిటీస్, జంపింగ్ క్యాజిల్ వంటివి ఉన్నాయి. ఈ ఫెస్టివల్ చూసేందుకు ముందే టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఎంట్రీ ఫీజు చిన్న పిల్లలకు 710 రూపాయలు. కాలేజీ స్టూడెంట్స్‌కు రూ.890. పెద్దవాళ్లకు రూ.1,070. నలుగురు ఫ్యామిలీ మెంబర్స్‌కి 2,950 రూపాయల టికెట్స్ కొనుక్కోవాలి. చెన్నై, చెన్నై చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు సోమవారం, శుక్రవారం ఈ ఫెస్టివల్‌కి ఎంట్రీ ఉచితం.