పవన్ అభిమానులను నామినేట్ చేసిన క్రిష్..

-

ప్రస్తుతం టాలీవుడ్‌లో ‌”బి ది రియల్ మ్యాన్” చాలెంజ్ ట్రెండ్ నడుస్తోంది. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి విసిరిన ఈ చాలెంజ్‌ను దర్శకుడు క్రిష్ విజయవంతంగా పూర్తి చేశాడు. ఇందుకోసం ఆయన మొక్కలుకు నీళ్లు పట్టడంతోపాటుగా వంట కూడా చేశాడు. ఈ వీడియోను క్రిష్ తన ట్వీటర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

అయితే ఈ చాలెంజ్‌కు ఆయన సెలబ్రిటీలను కాకుండా సామాన్యులను నామినేట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులను ఈ చాలెంజ్ కోసం నామినేట్ చేస్తున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరు ఇంటిలోని మహిళలకు పనులలో సాయం చేయాలని కోరారు.

కాగా, ఢిపరెంట్ సినిమాలు తీస్తారనే పేరు తెచ్చుకున్న క్రిష్.. పవన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నారనే సంగతి తెలిసిందే. ఈ చిత్రం పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందనుంది. ఇందులో బందిపోటు పాత్రలో పవన్ నటిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. పింక్ రీమేక్ వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ పూర్తైనా తర్వాత క్రిష్ చిత్రానికి పవన్ డేట్స్ కేటాయించనున్నాడు. ఈ చిత్రానికి ‘విరూపాక్షి’ అనే టైటిల్ అనుకుంటున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతానికి సినిమా షూటింగ్‌లు అన్ని వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news