అను ఇమ్మాన్యుయేల్ ఫేట్ 2020 లో మారనుందా ..?

-

చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ కి లైఫ్ స్పాన్ చాలా తక్కువ అన్న విషయం తెలిసిందే. అదే గనక వరసగా రెండు ఫ్లాప్ పడితే ఇక ఆ అమ్మాయిని మళ్ళీ పట్టించుకునే వాళ్ళే ఉండరు. అంతేకాదు మొదట్లో నాలుగు సూపర్ హిట్స్ పడి ఆ తర్వాత ఫ్లాప్స్ వచ్చిన హీరోయిన్ అయినా ఇదే లెక్క. ఆ లెక్కలోకి ఇపుడు వస్తుంది అనూ ఇమ్మాన్యుయేల్. 2016లో నాని హీరోగా తెరకెక్కిన ‘మజ్ను’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది అనూ ఇమ్మాన్యుయేల్. అయితే ఈ సినిమా అంతగా హిట్ అవకపోయినప్పటికి అనూ ఇమ్మాన్యుయేల్ కి మాత్రం నటిగా మంచి గుర్తింపు వచ్చింది.

 

దాంతో వరసగా సినిమాలు వచ్చాయి. రాజ్ తరుణ్ తో కిట్టుగాడు జాగ్రత్త, మాస్ హీరో గోపీచంద్ తో ఆక్సిజన్ లాంటి సినిమాలు చేసింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ సినిమాలోను ఒక హీరోయిన్ గా నటించింది. కానీ ఈ మూడు సినిమాలు ఫ్లాపయ్యాయి. దాంతో అనూ ఇమ్మాన్యుయేల్ పరిస్థితి చెప్పుకోలేనంతగా మారింది. ఆ తర్వాత నాగచైతన్యతో శైలజారెడ్డి అల్లుడు, అల్లు అర్జున్ తో నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలు దారుణంగా ఫ్లాపయ్యాయి. దాంతో అనూ ఇమ్మాన్యుయేల్ అంటే ఫ్లాప్ హీరోయిన్ అన్న ముద్ర పడిపోయింది.

రెండు మూడు సినిమాలలో మేకర్స్ అనుకున్నప్పటికి ఎందుకనో మళ్ళీ అనూ ఇమ్మాన్యుయేల్ కి ఛాన్స్ ఇవ్వలేదు. దాంతో అనూ ఇమ్మాన్యుయేల్ ఇక లైఫ్ క్లోజ్ అనుకుంది. కాని అనూహ్యంగా ఒక అవకాశం తలుపు తట్టింది. సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ’18 పేజెస్’ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ ని హీరోయిన్ గా తీసుకున్నారని తాజా సమాచారం. ఈ సినిమా గనక హిట్ అయితే అనూ ఇమ్మాన్యుయేల్ కి మళ్ళీ టాలీవుడ్ లో అవకాశాలు వస్తాయన్న ఆశతో ఉంది. నిఖిల్ కెరీర్ కూడా అంతంత మాత్రం గా ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అనూ ఇమ్మాన్యుయేల్ కి హిట్ దక్కుతుందా లేదా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news