ప్రశాంత్ వర్మ క్షమించమని ఎందుకు అడిగారు..?

-

యంగ్  హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో ప్రశాంత్ వర్మ  తెరకెక్కిస్తోన్న మరో చిత్రం హను-మాన్. . ఇటీవల విడుదలైన ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటూ మంచి వ్యూస్ సాధిస్తోంది. చాలా మంది నుండి ప్రశంశలు వస్తున్నాయి.

ఇక ఈ సినిమా టీజర్ ను ప్రభాస్ ఆదిపురుష్ సినిమా క్వాలిటీ తో పోలుస్తూ , ఆడిపురుష్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది డబ్బు ఉంటేనే కాదు, కంటెంట్ మరియు కమిట్ మెంట్ ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు. అసలే గ్రాఫిక్స్ బాగా లేక క్వాలిటీ కోసం విడుదలను వాయిదా వేసుకున్న ఆదిపురుష్ టీమ్ కు ఇది పుండు మీద కారం చల్లిన విధంగా మారింది.

అయితే అంతటా ప్రశంశలు కురిపిస్తున్న వేళ అకస్మాత్తుగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఓ విషయంలో క్షమాపణలు చెప్పారు. అసలెందుకు అని చాలా మంది ఆశ్చర్య పోయారు. కాని వర్మ  టీజర్ విడుదల సమయంలో రామాయణాన్ని పురాణం అన్నందుకు క్షమించండి అంటూ సోషల్ మీడియా వేదికగా కోరారు. ‘నా ప్రసంగంలో పురాణం అనే పదాన్ని ఉపయోగించినందుకు క్షమించండి. రామాయణం మన చరిత్ర’ అంటూ ట్వీట్ చేశారు. ఇది చూసిన చాలా మంది అదిపురుష్ లో దేవుళ్ల ను కించ పరిచేలా వుందని విమర్శలు రావడంతో ముందే జాగర్త పడి నెగిటివ్ టాక్ రాకుండా జాగర్త పడ్డారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news