భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూనిఫాం సివిల్కోడ్అన్నది జాతీయ అంశం అని అన్నారు. ఉమ్మడి పౌరస్మృతి.. జాతీయాంశం అని జేపీ నడ్డా అన్నారు. దీన్ని వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాల్లో అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ బడ్జెట్తో సంబంధం లేకుండా ఎన్నికల హామీలను ప్రకటిస్తున్నాయని ఆరోపించారు జేపీ నడ్డా. ఈ ఉమ్మడి పౌరస్మృతినే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల్ల మేనిఫెస్టోల్లో ఆ పార్టీ ప్రస్తావించింది. ఈ రెండు రాష్ట్రాల్లో భాజపా అధికారంలోకి వస్తే యూసీసీని తప్పని సరిగా అమలు చేస్తామని హామీ ఇచ్చింది. దీన్ని వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాల్లో అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
యాంటీ రాడికలైజేషన్ సెల్ ఏర్పాటు వేర్వేరు భాజపా మేనిఫెస్టోలోని వేర్వేరు హామీల్ని సమర్థించుకున్నారు జేపీ నడ్డా. ‘ఉమ్మడి పౌరస్మృతి అనేది జాతీయ అంశం.. దేశంలోని వనరులు ప్రజలందరికీ సమానం. అందువల్ల యూసీసీ అన్నది దేశవ్యాప్తంగా స్వాగతించదగిన చర్య. దీన్ని వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాల్లో అమలు చేయాలనుకుంటున్నాము. సమాజానికి వ్య తిరేకంగా పనిచేసే దుష్టశక్తులను అదుపుచేయడం దేశం బాధ్యత. మానవ శరీరంలో యాంటీబాడీలు పనిచేసే విధంగా.. సంఘ వ్యతిరేక శక్తులను నియంత్రించడం దేశ బాధ్యత. కొందరు అజ్ఞాతంలో ఉండి దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. వారిని అదుపు చేయడం కోసం యాంటీ-రాడికలైజేషన్ సెల్ అవసరం.’ అన్నారు జేపీ నడ్డా.