పసలేని వీడియోలతో రాజమౌళి విసిగిస్తున్నాడా..?

రాజమౌళి అంటే ఓ బ్రాండ్ .అలాంటి బ్రాండ్ ఇప్పుడు “ఆర్.ఆర్.ఆర్” సినిమాను నిత్యం వార్తల్లో నిలపాలని చూస్తున్నాడు.గతంలో ఎప్పుడూ లేనివిధంగా జక్కన్న ఈసారి చవకబారు కంటెంట్ ను సినిమా అప్ డేట్స్ గా ఎందుకు పోస్ట్ చేస్తున్నట్లు..రాజమౌళి అంటేనే ఓ బ్రాండ్ .అది టాలీవుడ్ టు బాలీవుడ్ వరకు ఉన్నదే.జక్కన్న నుంచి ఎలాంటి అప్ డేట్ వచ్చిన దాన్నో గొప్పగా చూసేవారు.ఇప్పుడు ఆ సీన్ అంతగా కనిపించడం లేదేమో అనిపిస్తుంది.ఎందుకంటే మునుపటిలా సెట్స్ మీదున్న సినిమా తాలుకు క్రిస్పీ కంటెంట్ ను రాజమౌళి తాజాగా పోస్ట్ చేయడం లేదు.ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాడంతే.

నిజానికి ఆర్ ఆర్ ఆర్ సినిమా తాలుకు భీం,రామరాజు టీజర్లతోనే రాజమౌళి చెప్పాల్సిన విషయం అక్కడితో అయిపోయింది.కాని ఆయనగారు అక్కడితో ఊరుకోకుండా పనలేని కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తేవాలని చూస్తున్నాడు.యాక్షన్ పార్ట్ తో కలుపుకుని షెడ్యూల్ 50డేస్ పూర్తిచేసుకుంది అనే సింపుల్ రష్ ఫీడ్ ను పబ్లిష్ చేస్తున్నాడు.దీంతో అప్పటివరకు రాజమౌళిని ఫాలో అయ్యే అభిమానులు..ఆయన నుంచి వస్తున్న అప్ డేట్స్ ను చూసి నోరెళ్లబెడుతున్నారు

గతంలో రాజమౌళి సినిమా సెట్స్ మీదుంటే దాని తాలుకు అప్ డేట్ దేనిని రిలీజ్ చేసినా.. క్రిస్పీగా ఎడిటింగ్ చేసి రిలీజ్ చేసేవాడు.ఇప్పుడు ఆ సీన్ అలా లేదు.ఏదో చేశాం అంటే చేసాం అన్నట్లుగా వ్యవహారముంది. కొత్తగా వస్తున్న అప్ డేట్స్ చూసి రాజమౌళి నుంచి ఏమైనా అప్ డేట్ వస్తే దానికి అంత చెప్పుకోదగ్గ లైక్స్ రావడం లేదు.ఇదంతా నాసిరకం కంటెంట్ ను పోస్ట్ చేయడం తోనే జరిగిందని కామెంట్స్ పడుతున్నాయి.సో ఇకనైనా రాజమౌళి పదే పదే అప్ డేట్స్ ఇవ్వడం మానేసి ..ఇస్తేగిస్తే తన రేంజ్ కు తగ్గట్లుగా అప్ డేట్స్ ఇవ్వడం బెటర్ అంటున్నారు.