లెజండరీ డైరెక్టర్ కన్నూమూత.. సినీ పరిశ్రమలో విషాదం

హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు, సూపర్‌ మ్యాన్‌ సృష్టికర్త ​​రిచర్డ్ డోనర్ చనిపోయారు. కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. రిచర్డ్ సోమవారం రాత్రి కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇక రిచర్డ్ డోనర్ .. సూపర్ మ్యాన్, గూనీస్ వంటి పలు చిత్రాలు తెరక్కించారు. 960 టీవీల్లో ‘ట్విన్ లైట్ జోన్’ అనే స్పై థ్రిల్లర్ స్టోరీస్‌తో సినీ రంగ ప్రవేశం చేశారు. 1978లో క్రిష్టోఫర్ రీవేతో తెరకెక్కించిన ‘సూపర్ మ్యాన్’మూవీ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సిరీస్ వచ్చిన పలు సినిమాలు తెలుగుతో పాటు హిందీలో కూడా విజయం సాధించాయి. ముఖ్యంగా సూపర్ మ్యాన్ స్టోరీతో పలు చిత్రాలు అదే టైటిల్‌తో తెలుగులోనూ విడుదలయ్యాయి. 1985లో రిచర్డ్ దర్శకత్వం వహిస్తూ ‘గూనీస్’ను నిర్మించారు. దీంతో ఆయన ప్రొడ్యూసర్ కూడా ఈ మూవీతో మంచి హిట్ సాధించారు. ఇక రిచర్డ్ మృతి పట్ల హాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.