ఢిల్లీ: 8 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి కాసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ బిజేపి నేత హరిబాబు కంభంపాటి మిజోరాం గవర్నర్‌గా నియామకం అయ్యారు. ఏపీ బిజేపి సీనియర్ నేతగా ఉంటున్న కంభంపాటి హరిబాబు.. పార్టీ కోసం ఎంతో కష్ట పడ్డారు. టిడిపితో పొత్తు ఉన్న సమయంలో విశాఖ ఎంపిగా పని చేశారు.
అలాగే హర్యానా గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ నియామకం కాగా… ప్రస్తుతం హిమాచల్ గవర్నర్ గా దత్తాత్రేయ పనిచేస్తున్నారు. అటు.. రాజేంద్రన్ విశ్వనాథ్ అర్లేకర్ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియామకం కాగా… హర్యానా గవర్నర్ గా ఉన్న సత్యదేవ్ నారాయణ్ ఆర్యను త్రిపుర గవర్నర్‌గా నియామకం అయ్యారు. తవర్ చంద్ గెహ్లాట్ కర్ణాటక గవర్నర్ గా నియామకం కాగా.. మంగూభాయ్ చాగన్‌భాయ్ పటేల్ మధ్యప్రదేశ్ గవర్నర్‌గా నియామకం అయ్యారు. అలాగే పి.ఎస్. శ్రీధరన్ పిళ్లై గోవా గవర్నర్‌గా నియామకం కాగా.. రమేష్ బైస్‌ను జార్ఖండ్ గవర్నర్ గా నియామకం అయ్యారు.