జూబ్లీహిల్స్ చిన్నారిపై లైంగికదాడి .. శేఖర్ కమ్ముల ఎమోషనల్ పోస్ట్

-

హైదరాబాద్ బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్ లో నాలుగేళ్ల చిన్నారిపై డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు ప్రిన్సిపల్ , ఆమె డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రినిపల్ ను అరెస్టు చేశారు.
తాజాగా ఘటనపై టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన  ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ‘డీఏవీ స్కూల్ లో చదువుతున్న నాలుగేళ్ల చిన్నారిని ప్రిన్సిపాల్ డ్రైవర్ రేప్ చేశాడు. ఈ ఘటన గురించి విన్నప్పడి నుంచి గుండెలో మెలిపెట్టినట్లుగా బాధగా ఉంది. నిస్సహాయతతో ఏం చేయాలో అర్ధం కావడం లేదు. ఆ చిన్నారి పడే బాధను ఊహించడానికే కష్టంగా ఉంది. ఆ చిన్నారి తల్లిదండ్రులు ధైర్యంగా పోరాటం చేస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. పిల్లల భద్రత విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు. ఆధునిక సమాజంలో ఇలాంటివి జరగకూడదు. వ్యవస్థ దీనిపై స్పందించాలి. అందరూ మేల్కొని చిన్నారుల భద్రతకు తగ్గట్లుగా ఈ సొసైటీని మార్చాలి. పిల్లల భద్రత విషయంలో రాజీ పడితే భయంకరమైన సమాజాన్ని రూపొందించినవారమవుతాం’ అంటూ శేఖర్ కమ్ముల పోస్టు చేశారు.
శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లవ్ స్టోరీ’ సినిమా లైంగిక వేధింపులకు సంబంధించినదే.  బంధువులు, చుట్టుపక్కల వారే బాలికలను ఏ విధంగా లైంగిక వేధింపులకు గురి చేస్తారో ఈ సినిమాలో చూపించారు. ఇప్పుడు రియల్ లైఫ్ లో ఇలాంటి సంఘటన జరగడంతో శేఖర్ కమ్ముల స్పందించారు.
https://twitter.com/sekharkammula/status/1583431560841539586

Read more RELATED
Recommended to you

Latest news