భద్రాద్రి రాముని భూములను వైసీపీ, టీడీపీ నేతలు మింగేశారని టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. భద్రాద్రి రాముని భూములు 650 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ లో యదేచ్చగా దురాక్రమణ చేశారని.. బీజేపీ కేంద్ర ప్రభుత్వ పాప ఫలితమే ఇదని మండిపడ్డారు.
ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో బలవంతంగా, ఏక పక్షంగా విలీనం చేయడంతో ఈ దురాక్రమణకు ఆజ్యం పోసిందని నిప్పులు చెరిగారు. రాముని పేరిట రాజకీయాలే తప్ప చిత్తశుద్ది లేని బీజేపీ… భద్రాద్రి రాముని భూములను ఆంధ్రప్రదేశ్ లో దురాక్రమణ నుంచి బీజేపీ కేంద్ర ప్రభుత్వం విముక్తి కలిగించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టులో ముంపుకు గురి కాని గ్రామాలను తిరిగి తెలంగాణకు స్వాధీన పర్చాలన్నారు.వై.ఎస్.ఆర్.సీ.పీ., టీ.డీ.పీ నాయకుల ప్రోత్బలంతోనే భద్రాద్రి రాముని భూముల ఆక్రమణ చేశారని ఆరోపణలు చేశారు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్.
–