అప్పుడు స్వప్నిక, ఇప్పుడు దిశ… తన స్టైల్లో న్యాయం చేసిన సజ్జనార్…! సెల్యూట్…!

-

అది 2008 డిసెంబర్… స్వప్నిక ను ప్రేమిస్తున్నా అన్నాడు శ్రీనివాస్… ఆమె వెంటపడ్డాడు… వేధించాడు, ఇబ్బంది పెట్టాడు… ఆమె ఎంతకు అంగీకరించకపోవడం తో తన స్నేహితులతో కలిసి ఒక పథకం రచించాడు. తన స్నేహితురాలు ప్రణీతతో కలిసి కళాశాలకు వెళ్తున్న స్వప్నికపై పథకం ప్రకారం ఆమె మొహంపై యాసిడ్ దాడి చేసాడు. ఆ దాడిలో ఆమె స్నేహితురాలు ప్రణీతకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి… స్వప్నిక మృతి చెందగా ప్రణీత ప్రాణాలతో బయటపడింది… సరిగా 48 గంటల్లో కేసు చేధించారు.

నిందితులు ముగ్గురుని అరెస్ట్ చేసారు పోలీసులు… విచారణలో వాళ్ళే నేరం చేసినట్టు పోలీసులు తేల్చారు. వారి వద్ద ఆయుధాలు కూడా ఉన్నాయని పోలీసులకు సమాచారం వచ్చింది. దీనితో ఆయుధాల మీద పోలీసులు విచారణ చేపట్టారు. ఆయుధాలను దాచి పెట్టిన ప్రదేశ౦ చూపిస్తామని వాళ్ళు చెప్పడంతో అక్కడికి తీసుకువెళ్ళారు పోలీసులు… పోలీసుల మీద వాళ్ళు తమ వద్ద ఉన్న ఆయుధాలతో కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరిపారు పోలీసులు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులు మృతి చెందారు…

అది పక్కన పెడితే… 2019 డిసెంబర్ 6… దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసు నిందితులను కస్టడికి తీసుకున్నారు పోలీసులు… విచారణలో భాగంగా వారిని ఘటనా స్థలానికి తీసుకువెళ్ళారు పోలీసులు. పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలను లాక్కుని వెళ్లేందుకు ప్రయత్నాలు చేయగా వారిని కాల్చి చంపారు పోలీసులు… ఇది కూడా ఆత్మరక్షణ కోసమే… సీన్ కట్ చేస్తే ఈ రెండు కేసులను డీల్ చేసింది ఒక్కరే… వీసి సజ్జనార్… ఇప్పుడు సైబరాబాద్ కమీషనర్… అప్పుడు వరంగల్ ఎస్పీ గా ఆయన పని చేసారు. ఈ రెండు కేసుల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు.

అసలు దిశ హత్య కేసు ఘటనను సజ్జనార్ డీల్ చేస్తున్నారు అనగానే సోషల్ మీడియాలో ఆయన ఫోటో తో… సర్ మీరు మళ్ళీ పాత సజ్జనార్ అవ్వాలి… వాళ్ళను కాల్చి చంపాలి… డీల్ చేస్తుంది సజ్జనార్… పది రోజుల్లోపు దేశం ఒక సంచలన వార్త వింటుంది… అందరూ అనుకున్నట్టు గానే సజ్జనార్ పని పూర్తి చేసారు. అప్పుడు స్వప్నికకు ఏ విధంగా న్యాయం చేసారో ఇప్పుడు దిశకు కూడా అదే విధంగా న్యాయం చేసారు సజ్జనార్… మీడియా, పోలీసులు ఎన్ని అయినా చెప్పవచ్చు… సజ్జార్ చేసింది ఏంటో సమాజానికి తెలుసు…

ఆయన ఇలాంటి కేసుల్లో ఏ విధంగా ఆలోచిస్తారో తెలియదు గాని… జనం మాత్రం ఒకటే అనుకుంటారు… చట్టాలు, న్యాయాలు సజ్జనార్ కి కనపడవు… కన్నుకి కన్ను ఆయన సిద్దాంతం. అవును అప్పుడు స్వప్నికకు న్యాయం చేసారు… ఇప్పుడు దిశకు న్యాయం చేసారు. నిందితులు దొరికినప్పటి నుంచి వాళ్ళను కంటికి రెప్పలా కాపాడారు. ఎన్ని నిరసనలు వచ్చినా సరే వాళ్ళను కనీసం మీడియాకు కూడా చూపించలేదు. దేశం మొత్తం ఆయన్ను కాల్చి చంపాలి అని నినదించింది. సజ్జనార్ మాత్రం దోషులకు త్వరగా శిక్ష పడేలా చేస్తామన్నారు.

ఆయన ప్రెస్ మీట్ పెట్టిన రోజు విచారణ ఇంకా జరుగుతూనే ఉందన్నారు… అప్పుడే ఆయన గురించి తెలిసిన వాళ్లకు అనేక అనుమానాలు… కేసు మొత్తం కొలిక్కి వచ్చింది ఇంకా ఏం విచారణ అనుకున్నారు… గురువారం మీడియాలో ఒక వార్త… నిందితులను సంఘటనా స్థలానికి తీసుకు వెళ్ళే అవకాశం ఉంది అని… ఒక క్లారిటి వచ్చేసింది. సరిగా 11 ఏళ్ళ క్రితం దేశం ఏ వార్త విన్నదో ఇప్పుడు కూడా అదే వార్త… వాళ్లకు భద్రత కల్పించడం ఒక వ్యూహం, వాళ్ళను కస్టడికి తీసుకోవడంలో కూడా ఒక వ్యూహమే… వాళ్ళకు సంబంధించిన వీడియో క్లిప్ కూడా ఒక వ్యూహమే.

జనాలు ఎక్కువగా నిరసన తెలుపుతున్నారు కాబట్టి వాళ్ళను ఉంచిన చర్లపల్లి జైలు వద్దు 144 సెక్షన విధించారు. పగలు విచారణ చేస్తే ప్రజలు అడ్డు తగులుతారు మీడియా హడావుడి ఉంటది కాబట్టి జనాలు లేని తెల్లవారు జామున తీసుకువెళ్ళారు… పని పూర్తి చేసారు. సెల్యూట్ సజ్జనార్ అంటుంది ఇప్పుడు దేశం… అప్పుడు ఆయనకు ఆదేశాలు ఇచ్చింది వైఎస్ ఇప్పుడు ఆయనకు ఆదేశాలు ఇచ్చింది కెసిఆర్… ఆయన గురించి తెలిసిన వాళ్లకు మాత్రం ఆయన నిర్ణయం తీసుకునే ముఖ్యమంత్రులకు చెప్పారూ అని… ఎనీ వే… సెల్యూట్…! దిశకు న్యాయం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news