Bholaa Shankar : చిరంజీవితో రొమాన్స్ చేయనున్న తమన్నా !

-

మెగాస్టార్ చిరంజీవి సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యాన్స్ కోసం వరుసగా సినిమాలను పట్టా లెక్కిస్తున్నారు చిరంజీవి. ఇప్పటికే రామ్ చరణ్ నిర్మాతగా చేసిన ఆచార్య మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్న చిరంజీవి… ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నారు. మ‌రోవైపు.. చిరు మెహర్ రమేష్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయబోతున్నాడు.

ఆ సినిమాకు భోళా శంకర్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‏ను ఫిక్స్ చేశారు నిర్మాతలు. త‌మిళంలో సూప‌ర్ హిట్ అయిన వేదాంళం అనే చిత్రానికి తెలుగు రీమేక్ గా భోళా శంక‌ర్ తెర‌కెక్కుతుంది. అన్నా చెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ సినిమాలో చిరు చెల్లెలిగా కీర్తిసురేష్ నటిస్తున్న విష‌యం తెలిసిందే. ఇక ఈ చిత్రం నుంచి మ‌రో అప్డేట్ వ‌చ్చేసింది.

ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్రం. ఈ మేరకు తమన్నా పోస్టర్ ను కూడా విడుదల చేసింది. చిరంజీవి సరసన సైరా సినిమాలో ప్రేక్షకులను అలరించింది తమన్నా. అయితే తాజాగా మరోసారి చిరంజీవి సరసన నటించేందుకు సిద్ధమైంది. ఇక ఈ తాజా అప్డేట్ తో మెగా ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం నెలకొంది. కాగా ఇవాళ ఉదయం ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news