వైసీపీ పార్టీ నుంచి గెలుపొందిన రఘురామకృష్ణంరాజు ప్రస్తుతం వైసీపీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తూ ఎప్పుడూ ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోతున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు లేవనెత్తని అంశాలను సైతం తెరమీదికి తీస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఇటీవలే జగన్ సర్కార్ తీసుకొచ్చిన వైయస్సార్ బీమా పథకం పై విమర్శలు చేశారు. ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన రఘురామకృష్ణంరాజు.. గతంలో ఏపీ లో ఉన్న పథకానికి పేరుమార్చి వైయస్సార్ బీమా అనే పథకాన్ని జగన్ సర్కార్ తీసుకొచ్చింది అంటూ విమర్శించారు.
అంతే కాకుండా రాష్ట్రంలో జగన్ సర్కార్ ప్రవేశపెడుతున్న ఎన్నో పథకాలకు కేంద్రం నుంచి కూడా నిధులు వస్తున్నాయని కానీ ఎక్కడా కూడా జగన్ పథకాల్లో ప్రధానమంత్రి పేరు కనిపించడం లేదు అంటూ ఆరోపించారు రఘురామకృష్ణంరాజు. జగన్ సర్కార్ ఇంగ్లీష్ మీడియం నిర్ణయం ద్వారా తెలుగును నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ ఆరోపించిన రఘురామకృష్ణంరాజు.. రాష్ట్రంలో న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టించేందుకే జగన్ సర్కార్ ప్రయత్నిస్తుందని దీనిపై మోదీ కి లేఖ రాసినట్లు తెలిపారు.