బేజేపీలో అనర్హత ఎమ్మెల్యేలకు.. మళ్ళీ సీట్లు

అనర్హత వేటుపడిన 17 మంది కాంగ్రెస్, జేడీఎస్ అసంతృప్తి ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే అవకాశాలపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. కర్ణాటకలో శాసనసభ ఎన్నికల అనంతరం పార్టీ ఫిరాయించిన 17 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు ఊరటనిస్తూ సుప్రీంకోర్టు నిన్న తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. స్పీకర్ నిర్ణయంతో అనర్హత వేటు పడ్డ ఆ 17 మంది.. ఉప ఎన్నికల్లో పోటీ చేయవచ్చని తెలిపింది. దీంతో ఆ 17 మందిలో 15 మంది ఈ రోజు బీజేపీలో చేరారు. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఆధ్వర్యంలో వారు ఈ రోజు బీజేపీ కండువా కప్పుకున్నారు.

వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు యడియూరప్ప తెలిపారు. కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు త్వరలోనే ఉపఎన్నికలు జరగబోతున్నాయి. కాగా, ఈ కార్యక్రమానికి ముందు యడియూరప్ప.. మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా తమ పార్టీ నేతలతో కలిసి ఆయనకు నివాళులర్పించారు.