డిసెంబర్ లోపు 80 వేల టిడ్కో ఇళ్ల పంపిణీ చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన చేశారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్లకు శాశ్వత హక్కు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 60 లక్షల మందికి ఇంటిపై శాశ్వత హక్కు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారని…
దీని కోసం విధి విధానాలు రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారని స్పష్టం చేశారు.
ఎన్నికల ఫలితాలు లెక్కించాలని తీర్పు ఇచ్చిన రోజు నుంచి టీడీపీలో ఆక్రోశం, ఆందోళన మొదలైందన్నారు. ప్రజలు సమస్యలు పరిష్కరించే ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తారని ఎన్నికల ఫలితాలతో నిరూపితమైందని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు పనైపోయిందని… టీడీపీకి ప్రజల్లో మనుగడ లేదని ఎద్దేవా చేశారు. టీడీపీ విలువలు కాపాడు కోవాల్సిన పరిస్థితి ఉందని… ఎన్నికల ఫలితాల తో ఇప్పటికైనా టీడీపీ బుద్ది తెచ్చుకోవాల వెల్లడించారు. ప్రజలిచ్చిన తీర్పు స్పూర్తితో ప్రజల సేవకు సీఎం జగన్ పునరంకితమవుతారన్నారు.