అదిరిపోయే క్రెడిట్ కార్డ్స్ ని తీసుకొచ్చిన యూనియన్ బ్యాంక్..!

-

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో NPCI భాగస్వామ్యం కుదుర్చుకుని కొత్త క్రెడిట్ కార్డును మార్కెట్‌ లోకి తీసుకు వచ్చింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే…

credit card | క్రెడిట్ కార్డు
credit card | క్రెడిట్ కార్డు

 

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకు వచ్చిన క్రెడిట్ కార్డు పేరు రూపే జేసీబీ వెల్‌నెస్ క్రెడిట్ కార్డు. అయితే ఈ కార్డుని బ్యాంక్ జేసీబీ నెట్‌వర్క్ ద్వారా తీసుకు రావడం జరిగింది. అయితే లైఫ్‌స్టైల్, ఫిట్‌నెస్, హెల్త్, పర్సనల్ కేర్ విభాగాలు లక్ష్యంగా బ్యాంక్ ఈ కార్డును తీసుకు వచ్చింది. అయితే ఈ కార్డు తో ఎన్నో రకాల ప్రయోజనాలు పొందొచ్చు.

ఇది ఇలా ఉంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపే జేసీబీ వెల్‌నెస్ క్రెడిట్ కార్డు తీసుకోవడం వల్ల.. ఏడాదిలో ఒకసారి ప్రీమియం హెల్త్ చెకప్‌ ఉచితంగా తీసుకో వచ్చు. నెక్స్ట్ హెల్త్ చెకప్స్‌ పై డిస్కౌంట్ కూడా వస్తుంది. అలానే ఏడాది లో ఒక సారి స్పా ఉచితంగా పొందొచ్చు.

తర్వాత డిస్కౌంట్ లభిస్తుంది. ఇలా ఈ బెనిఫిట్స్ ని చక్కగా పొందొచ్చు. 15 రోజులు లేదా నెల వరకు ఉచితంగా జిమ్ మెంబర్‌ షిప్ పొందొచ్చు. తర్వాత 40- 50 శాతం తగ్గింపు పొందొచ్చు. అలానే డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ ఉచితం.

Read more RELATED
Recommended to you

Latest news