బిగ్ బాస్ హౌస్ లో దీపావళి స్పెషల్.. సందడి చేయనున్న సర్దార్..!

-

సాధారణంగా సండే అంటేనే బిగ్ బాస్ హౌస్ లో ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. అలాంటిది దీపావళి పండుగ కావడంతో అతిధులు కూడా షో కి రావడం .. కంటెస్టెంట్స్ తో డబుల్ ఎంటర్టైన్మెంట్ లభించిందని చెప్పాలి. దీపావళి స్పెషల్ ఎపిసోడ్ లో భాగంగా గెస్ట్ గా వచ్చిన సెలబ్రిటీలు మాస్ డాన్స్ లతో, క్లాస్ పర్ఫామెన్స్ తో దుమ్ము లేపారు. గెస్ట్ సాంగులో జబర్దస్త్ యాంకర్ రష్మీ హాట్ సాంగ్ కి కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్ తో అదరగొట్టేసింది. ఆ తర్వాత అంజలి కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ ఇవ్వగా సర్దార్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా స్పెషల్ గెస్ట్ గా కార్తి వచ్చాడు. ఇలా ఒక్కొక్కరు మాంచి కిక్ ఇచ్చే పర్ఫామెన్స్ తో ప్రేక్షకులకు పండుగ రుచిని చూపించేశాడు బిగ్ బాస్. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దీపావళి సంబరాలు పూర్తి చేశారు.

తారల డాన్సులు, సింగర్స్, పాటలు, హైపర్ ఆది కామెడీ, హీరో కార్తీ రాక వీటన్నింటితో ఒకరోజు ముందుగానే దీపావళి జరుపుకుంది బిగ్ బాస్ . మొదటగా నటి అంజలి కంటెస్టెంట్స్ తో ముచ్చటించి తర్వాత హౌస్ మేట్స్ జంట డాన్స్ చూసింది. ఆ తర్వాత వచ్చిన శ్రీరామచంద్ర తన సాంగ్ పెర్ఫార్మెన్స్ చేశాడు. హైపర్ ఆది హౌస్ మేట్స్ అందరి గురించి చెప్పడం తర్వాత కార్తి రావడం అన్నీ కూడా స్టేజ్ కు మరింత రంగులను తీసుకొచ్చాయి. తర్వాత హౌస్ మేట్స్ అందరికీ స్వీట్స్ తెచ్చిన కార్తీ నామినేషన్ లో ఉన్న వాళ్లలో ఇద్దరినీ సేవ్ చేశాడు. తర్వాత హౌస్ మేట్స్ తో సాగిన చిన్న గేమ్ లో పాల్గొన్నారు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ కి కార్తీ ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళిపోయాడు.హైపర్ ఆది కూడా తన కామెడీతో మరొకసారి నవ్వుల పువ్వులు పూయించాడు. మొత్తానికైతే అంతమంది తారలు స్టేజ్ పై దీపావళి పండుగను సెలబ్రేట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news