వర్షాలపై కేసీఆర్ సర్కార్ ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు : డీకే అరుణ

-

బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ హైదరాబాద్​లోని నాంపల్లిలో బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతున్నారు. ఆమె ప్రధానంగా రాష్ట్రంలో సంభవించిన వర్షాలు దాని ప్రభావం వలన వచ్చిన వరదలు ఇలా అనేక అంశాలపై మాట్లాడుతున్నారు. ఈ సందర్బంగా బీఆర్​ఎస్​ ప్రభుత్వంపై పలు విమర్శలు చేస్తున్నారు. వరద సమయంలో ప్రజలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అలాగే వచ్చే నెల 3వ తేదీ నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ అంశంపై కూడా ఆమె మాట్లాడారు.

భారీ వర్షాల కారణంగా గ్రేటర్ వరంగల్ లో 150కాలనీలు మునిగిపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధమౌతుందన్నారు. నీళ్లలోనే వరంగల్ లో ఉందా అనే అనుమానం కలుగుతుందన్నారు. భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరదల విషయమై కేసీఆర్ సర్కార్ ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని ఆమె విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్నారు.వరంగల్ గురించి గొప్పగా మాట్లాడిన కేసీఆర్,కేటీఆర్ ఇప్పుడు ఏం చెబుతారని ఆమె ప్రశ్నించారు. హైద్రాబాద్ ను డల్లాస్, ఇస్తాంబుల్ చేస్తామని కేసీఆర్ సర్కార్ ప్రకటనలను ఆమె గుర్తు చేశారు. హైద్రాబాద్ లోని చాలా ప్రాంతాల్లో కూడ వరద నీరు నిలిచిపోయిందని ఆమె చెప్పారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version