బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించిన 70 మంది సభ్యుల టీమ్ లో తెలంగాణ నుండి డీకే అరుణ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆమెను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించారు జేపీ నడ్డా. జాతీయ స్థాయి బాధ్యత లు అప్పగించిన నా ఫోకస్ రాష్ట్రం పైనేనని నూతనంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షరాలుగా నియమించబడిన డీకే అరుణ పేర్కొన్నారు. తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తానన్న ఆమె ఈసారి అధికారం లోకి వచ్చేది బీజేపీనేనని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అబద్ధపు ప్రచారాల్ని ప్రజల్లో ఎండగడుతామని ఆమె అన్నారు.
టీఆర్ఎస్ పై పోరాడతారా లేదా అని నేను పార్టీ లో చేరేటప్పుడే కేంద్ర నాయకత్వాన్ని అడిగానని అప్పుడు వాళ్ళు పోరాడుతామని హామీ ఇచ్చారని ఆమె అన్నారు. నాకు బాధ్యత ఇవ్వడం దానికి సంకేత మనే అనుకోవచ్చని ఆమె అన్నారు. ఇంకా చాలా మంది బీజేపీలో చేరుతారన్న ఆమె అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ నియంత పాలనకు వ్యతిరేకంగా ఉన్నారని వారంతా బీజేపీలో చేరుతారని అన్నారు. జాతీయ స్థాయి బాధ్యతలు అప్పగించినా నా ఫోకస్ రాష్ట్రం మీదే ఉంటుందని ఆమె అన్నారు.