డీఎంకే నేత, తమిళనాడు ఎంపీ ఏ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూమతం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై హిందూ సంఘాలుు మండిపడుతున్నాయి. ఈ వ్యాఖ్యలతో కూడిన వీడియో బయటపడడంతో బిజెపి ఘాటుగా స్పందించింది. బిజెపి తమిళనాడు శాఖ అధ్యక్షుడు కే అన్నములై ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తమిళనాడులోని నమక్కల్ లో గత వారం ఏ రాజా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. హిందూమతంలో కుల వ్యవస్థ గురించి ప్రస్తావించారు.
“హిందువులుగా ఉన్నంతవరకు మీరు శూద్రులు గానే ఉంటారు. నువ్వు శూద్రునిగా ఉన్నంతవరకు వేశ్య కొడుకువి. నువ్వు హిందువుగా ఉన్నంతవరకు దళితుడివి. హిందువుగా ఉన్నంతవరకు నువ్వు అంటరాని వాడివి.” అని ఆయన అన్నారు. అంతేకాదు ఆయన సుప్రీంకోర్టును కూడా విమర్శించారు. నువ్వు క్రైస్తవుడివి/ ముస్లిం వి/ పర్షియన్ వి కాకపోతే నువ్వు తప్పనిసరిగా హిందువుగా అవ్వాలని సుప్రీంకోర్టు చెప్తోందని, ఇలాంటి దురాగతం మరే దేశంలోనైనా ఉందా? అని ప్రశ్నించారు. రాజా చేసిన వ్యాఖ్యలపై బిజెపి తీవ్ర అగ్రహారం వ్యక్తం చేసింది.