తమిళనాడులో విపక్ష డిఎంకె పార్టీకి ఒకే రోజు రెండు ఘటనలు షాక్ ఇచ్చాయి. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకే రోజులో ప్రాణాలు కోల్పోయారు. 58 ఏళ్ళ గుడియాతం ఎమ్మెల్యే ఎస్.కథవరాయణ్ మూత్ర పిండాల వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. ఆయన కొంత కాలంగా మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే బైపాస్ సర్జరీ కూడా చేసినా ఆయన ఆరోగ్య౦ కుదుట పడలేదు.
తిరువత్తియూరు ఎమ్మెల్యే కేపీపీ స్వామి కూడా అనారోగ్యంతోనే మరణించారు. గత కొన్నాళ్ళు గా అనారోగ్యంతో బాధపడుతున్న స్వామీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఉదయం 6 గంటల ప్రాంతంలో గుండెపోటు వచ్చింది. దీనితో 24 గంటల వ్యవధిలో ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాణాలు కోల్పోయారు. దీనితో విపక్ష డిఎంకె లో విషాద చాయలు అలముకున్నాయి. ఈ మధ్య రాజకీయంగా బలపడుతుంది ఆ పార్టీ.
అధికార అన్నాడిఎంకే ని ఎదుర్కొని నిలబడుతుంది. బిజెపి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా సరే స్టాలిన్ ఆ పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. వారిద్దరి మృతిపై ఆయన సంతాపం ప్రకటించారు. పార్టీలో ఇద్దరూ బలమైన నేతలుగా ఉన్నారు. దీనితో వారి మరణం పార్టీకి తీరని లోటు అని పార్టీ నేతలు అంటున్నారు. స్వామి కి అన్ని పార్టీల నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. జయలలిత ఉన్నప్పుడు నియోజకవర్గంలో బలమైన నేతను నిలిపినా సరే ఆయన ఎదురొడ్డి నిలిచారు.