బాదంతో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ మెరుగుపడతాయా..?

-

ప్రతి రోజూ బాదం(almond)తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎన్నో అనారోగ్య సమస్యలకి ఇది చెక్ పెడుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ తో బాధపడే వాళ్ళకి డయాబెటిస్ రాకుండా జాగ్రత్త పడాలి అన్నా కూడా బాదం బాగా ఉపయోగపడుతుంది. మరి ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా దీని కోసం ఇప్పుడే పూర్తిగా తెలుసుకుందాం.

బాదం/ almond
బాదం/ almond

కొత్త స్టడీ ప్రకారం బాదం తీసుకోవడం వల్ల వీళ్లల్లో గ్లూకోస్ మెటబాలిజం ఇంప్రూవ్ అయినట్లు తేలింది. ఈ స్టడీలో 275 మంది పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా ప్రీ డయాబెటిస్ తో బాధపడుతున్న వాళ్లే… బరువు, ఎత్తు కొలిచి శాంపిల్స్ తీసుకున్నారు.

అదే విధంగా అభ్యర్థులు గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ కూడా చేయించుకున్నారు. లిపిడ్స్ ని కూడా టెస్ట్ చేయడం జరిగింది. అయితే బాదం తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గిపోయిందని బాదం తీసుకొని వాళ్ళతో పోల్చుకుంటే.. బాదం తీసుకొని వీళ్లలో HDL లెవెల్స్ సరిగా ఉన్నట్లు తేలింది.

అసలు ఇది ఎలా జరిగింది…?

బాదం తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గింది. హృదయ సంబంధిత సమస్యలు రిస్కు కూడా తగ్గుతోంది. ఆ తర్వాత రీసెర్చ్ మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క బరువు, ఎత్తు అన్ని చెక్ చేశారు. దీనిలో మంచి రిజల్ట్ వచ్చింది అని నిపుణులు గమనించడం జరిగింది.

డయాబెటిస్ రిస్క్ ఎలా తగ్గుతుంది..?

బాదం లో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తగ్గిస్తుంది. ఉదయాన్నే లేచిన తర్వాత నానబెట్టిన బాదం తినడం వల్ల చక్కటి ప్రయోజనాలు కనపడతాయి. మీరు కావాలంటే ఏదైనా ఓట్ మీల్ రెసిపీస్ లో కూడా వేసుకోవచ్చు. స్నాక్స్ కింద కూడా తీసుకోవచ్చు. కాబట్టి ప్రతిరోజు ఎనిమిది బాదం పప్పులు తినడం వల్ల మంచిగా ఉండొచ్చని ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news