ఆన్‌లైన్‌ లావాదేవీలు చేస్తున్నవారు రెండు రోజులు ఆగండి!

-

ఆన్‌ లైన్‌ బ్యాకింగ్‌ , ఆధార్, ఈపీఎఫ్‌ లావాదేవీలు చేస్తున్నారా? రెండు రోజులు ఆగండి. లేదంటే భారీగా నష్టపోతారు. బ్యాంక్‌ ఆన్‌ లైన్‌ లావాదేవీలు చేసేటప్పుడు మన ఫోన్‌ కు ఓటీపీ వస్తుందన్న విషయం అందరికీ తెలుసు . రెండు రోజులుగా దేశవ్యాప్తంగా బ్యాంకింగ్, ఆధార్, ఈపీఎఫ్‌ సేవలకు సంబంధిచింన ఓటీపీ, ఎస్‌ఎంఎస్‌ మెసేజ్‌ సర్వీసులు చాలా చోట్ల స్తంభించిపోయాయి. ఆన్‌ లైన్‌ కొనుగోళ్లు,  కీలక లావాదేవీల్లో ఓటీపీలే కీలకం, ఎస్బీఐ లాంటి బ్యాంకులు ఓటీపీ ద్వారానే ఏటీఎంలలో నగదు డ్రా చేసుకునే అవకాశం కల్పించాయి. ఈ నేపథ్యంలో నియోగదారులు ఓటీపీ ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు.

 

టెలికం కంపెనీల నూతన విధానం అప్‌ డేట్‌ అయ్యేవరకు ఎస్‌ఎంఎస్‌ వచ్చే అవకాశం లేకపోవడంతో ఏదైనా సైబర్‌ మోసం జరిగితే వెంటనే గుర్తించడం కష్టమని నిపుణలు చెప్తున్నారు.
40శాతం ఓటీపీ, ఎస్‌ఎంఎస్‌ సేవలు నిలిచిపోయాయి. దీనికి ప్రధాన కారణం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా కొత్త రూల్స్‌ అం రెగ్యులేషని అందుబాటులోకి తీసుకురావడమే.దీనికి పెద్దకారణమే ఉంది. ఇటీవల దేశంలో ∙ప్రమోషనల్, ఫ్రాడ్‌ కాల్స్, సైబర్‌ క్రై మ్‌ ఫోన్‌ కాల్స్‌ ఎక్కువ కావడంతో వాటికి అడ్డుకట్ట వేసేందుకు ట్రాయ్‌–2019లో నూతన బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీని అందుబాటులో తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం టెలికాం సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.

కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు పెండింగ్‌ లో ఉండటంతో ఈ మధ్య దీన్ని తప్పనిసరి చేసింది. ప్రభుత్వం సూచించిన మార్పులను అమలు చేసే కార్యక్రమంలో భాగంగా టెలికం సంస్థల ఎస్‌ఎంఎస్‌ సేవలకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. కొత్త రూల్స్‌ ప్రకారం ఇకపై వినియోగదారులు ఎస్‌ఎంఎస్‌ ను పంపించే సంస్థలు, బ్యాంకులు, పేమెంట్‌ సంస్థలు, ఆధార్, ఈపీఎఫ్‌ వంటి సేవలు అందించే ప్రభుత్వ ఏజెన్సీలు కొన్ని మెసేజింగ్‌ టెప్లెట్లను తయారు చేయడమే కాకుండా.. ఇప్పటికే ఉన్నవాటిని అప్‌ డేట్‌ చేయాల్సి వచ్చింది.

కొత్త మెసేజింగ్‌ టెంప్లెట్లలో సూచించిన విధంగా వినియోగదారులు మెసేజ్‌ పంపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మెసేజింగ్‌ సేవలు నిలిచిపోయాయి. రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తై.. ఓటీపీ, ఎస్‌ఎంఎస్‌ సేవలు పునరుద్ధరించనున్నారు. ముఖ్యమైన ఓటీపీ సేవలు నిలిచిపోయినా.. ఆతర్వాత ప్రయోజనాలే ఎక్కువ ఉంటాయని టెలికం కంపెనీలు చెబుతున్నాయి. మోసపూరిత మెసేజ్‌ లు వచ్చే అవకాశాలు భవిష్యత్తులో తగ్గిపోనున్నాయి.బ్యాంకింగ్‌ ఓటీపీ మెసేజ్‌ అలర్ట్స్‌ నిలిచిపోవడంతో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోయే అవకాశముంది. ఒకవేళ మన అకౌంట్‌ లేదా క్రెడిట్, డెబిట్‌ కార్డులతో లావాదేవీ జరిగితే దీనికి సంబంధించిన ఓటీపీ, ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌ వస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version