చదువుకున్న మహిళలను పని చేయమని బలవంతం చెయ్యొద్దు: బాంబే హైకోర్టు

-

దువుకున్నంత మాత్రానా మహిళలను పని చేయాలని బలవంతం చెయ్యొద్దని బాంబే హైకోర్టు శనివారం ఆదేశాలు జారీ చేసింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు బయటికి వెళ్లి పని చేయాలా? ఇంట్లోనే ఉండాలా? అనే నిర్ణయాన్ని వారిపైనే వదిలేయాలన్నారు. మహారాష్ట్రలోని పూణేకు చెందిన ఒక జంటకు 2010లో వివాహం జరిగింది. 2013లో భర్త, అతడి కుటుంబంపై భార్య గృహహింస కేసు పెట్టింది. అనంతరం ఆమె తన కుమార్తెతో కలిసి విడిగా నివసిస్తోంది.

బాంబే హైకోర్టు
బాంబే హైకోర్టు

ఈ మేరకు కేసు విచారణ పెండింగ్‌లో ఉండటంతో.. అప్పటివరకు భర్త నుంచి పోషణ ఖర్చులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది. దీంతో భార్యకు రూ.5వేలు, కుమార్తెకు రూ.7 వేలు నెలకు చెల్లించాలని పూణే ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది. దీంతో మహిళ భర్త బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. తన భార్య వరుసగా వేస్తున్న కేసులపై పోరాడే ఆర్థిక స్థోమత తనకు లేదన్నాడు. ఉద్యోగం చేస్తున్న భార్య.. తనకు ఎలాంటి ఆదాయ వనరు లేదని తప్పుగా చెబుతోందని అన్నారు. దీంతో న్యాయమూర్తి భారతి డాంగ్రే విచారణ జరిపారు. డిగ్రీ పూర్తి చేసుకున్న మహిళ.. ఉద్యోగం చేయాలా? ఇంట్లో ఉండాలా? అనే నిర్ణయం మహిళలపై ఆధారపడి ఉంటుందన్నారు. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే వారానికి కోర్టు వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news