యాంటీ బాడీస్ మీద ఆశలు వద్దు… ప్రపంచ ఆరోగ్య సంస్థ…!

-

కరోనా వైరస్ కి మందు అనేది ఇప్పటి వరకు ఎవరూ కూడా కనుక్కోలేదు. దానికి మందు అనేది లేకపోతే దాన్ని కట్టడి చేయడం అనేది ఎవరికి సాధ్యం అయ్యే విషయం కాదు మందు లేకపోతే అని కొందరు అంటున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ కి మన శరీరంలో ఉండే యాంటీబాడీస్ (వ్యాధి నిరోధక శక్తి మూలాలు) మనల్ని కరోనా వైరస్ నుంచి కాపాడతాయనీ, కరోనా నయమైన వారి బాడీ నుంచి యాంటీ బాడీస్…

ని ఎక్కువగా సేకరించి మిగతా రోగులకు ఎక్కిస్తే వారికి కూడా కరోనా తగ్గుతుంది అనేది చాలా మంది నమ్మకం. అసలు అలాంటి ఆశలు పెట్టుకోకుండా ఉండటమే మంచిది అంటుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. రక్తంలో ఉండే యాంటీ బాడీస్ తో… ఒకసారి కరోనా వైరస్ సోకి, నయమైన వారికి మళ్లీ కరోనా సోకదనేందుకు నమ్మకంగా తాము ఏమీ చెప్పలేము అని చెప్పింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రముఖ ఎమర్జెన్సీస్ నిపుణుడు మైక్ ర్యాన్ ఈ ప్రకటన చేసారు.

చాలా మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారు, తమ యాంటీ బాడీస్ దానం చేసేందుకు ముందుకు వస్తున్నారన్న ఆయన… కానీ ఇలా వారి యాంటీ బాడీస్‌ని కరోనా పేషెంట్లకు ఎక్కించడం వల్ల కలుగుతున్న ప్రయోజనం చాలా తక్కువగానే ఉంటోందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాల ప్రభుత్వాలన్నీ… ఇప్పుడీ యాంటీబాడీస్‌పై దృష్టి పెట్టాయనీ, వీటిని సేకరించే పనిలో పడ్డాయనీ చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news