దరిద్రం పోవాలంటే ఇంట్లో నుంచి వీటిని పారేయండి!

-

మనకు చాలా నమ్మకాలు ఉంటాయి. కొందరు వాటిని అతివిశ్వాసం అని కొట్టి పారేసినా, నమ్మక తప్పదు. ఎవరి నమ్మకం వారిది. మన సప్రదాయాల ప్రకారం చాలా నమ్మకాలు ఉంటాయి. కొంత మంది వాటిని ఆచరిస్తారు. మరికొంత మంది వాటిని కొట్టిపారేస్తారు. కొన్ని వస్తువులను ఇంట్లో నుంచి పారేయండని చెబుతున్నారు పండితులు.


పగిలిపోయిన వంటింట్లోని వస్తువులను ఇంట్లో ఉంచకూడదు. అలాంటి వాటిలో భోజనం చేయకూడదు. విరిగిపోయిన ప్లేట్లలో అన్నం తినకూడదు. పగిలిన అద్దాలను ఇంట్లో ఉంచకూడదు.

డబ్బులు పెట్టి కొన్నాం కదా అని వాటిని ఇంట్లో పెట్టుకోకూడదు. పగిలిన వస్తువుల వల్ల నెగిటివ్‌ ఎనర్జీ పెంచుతుంది. వాటి వల్ల ఇంట్లో అశాంతి పెరుగుతుంది. అలాంటి వాటి వల్ల నెగిటివ్‌ ఎనర్జీ పెరుగుతుంది. దానివల్ల దరిద్రం వస్తుంది. అందుకే అలాంటి వస్తువులను వెంటనే మీ ఇంట్లో ఉంటే పారేయండి.

పాడైన ఫర్నిచర్, విరిగిన మంచం కూడా ఇంట్లో ఉంచకూడదు. అలాంటి మంచం మీద పడుకోకూడదు. దీనివల్ల ఇంట్లో గొడవలు వస్తాయి. డబ్బు ఖర్చయిపోతుంది, అప్పులు పెరుగుతాయి. ముచ్చటగా ఉన్నాయని ఇంట్లో పెట్టుకుంటే ఇక అంతే!
ఇంకా చాలా మంది ఇంట్లో నిరుపయోగంగా ఉన్న వస్తువులను ఇంటి సజ్జాపై పెట్టుకుంటారు. అటువంటి వస్తువులను వెంటనే ఇంటి నుంచి పడేయాలి. పిల్లలు ఆడుకునే పాత టెడ్డీబేర్లను, పాడైన ఎలక్ట్రిక్‌ వస్తువులు టీవీ వంటివి పనిచేయని వాటిని ఇంట్లో అస్సలు ఉంచకూడదు. వీటి వల్ల అనేక ఇబ్బందులు వస్తాయి. ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ పెరిగి అప్పుల పాలవుతారు. చాలా రోజుల నుంచి మనం వాడే ప్లేట్లు పగుళ్లు వస్తాయి. నీరు తాగే గ్లాసులకు కూడా పగుళ్లు ఏర్పడతాయి. వీటిలో భోజనం చేయకూడదు. పగుళ్ల వల్ల నే నెగిటివ్‌ ఎనర్జీ పెరిగిపోతుంది. అటువంటి ఇంట్లో ఉన్న వ్యక్తులకు తీవ్ర అశాంతి పెరిగి మనస్పార్థలు వస్తాయి. డిప్రెషన్‌ స్థాయికి కూడా వెళ్లిపోతారు. అందుకే ఇంట్లోని నిరుపయోగంగా ఉన్నవాటì ని బయట పరేయడమే మేలు కదా!

 

 

Read more RELATED
Recommended to you

Latest news