పాలతో ఈ పదార్ధాలను కలిపి పొరపాటున కూడా తీసుకోవద్దు…!

-

పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. జ్ఞాపకశక్తిని పెంచడానికి పాలు ఉపయోగపడతాయి. అదేవిధంగా పాలతో ఇతర ఎన్నో ప్రయోజనాలను కూడా మనం పొందొచ్చు. క్యాల్షియం లోపం ఉన్న వాళ్ళు పాలు తీసుకోవడం వల్ల క్యాల్షియం లోపం సమస్య ఉండదు. ఎముకలు కూడా బలంగా ఉంటాయి.

 

పాలల్లో ప్రోటీన్, విటమిన్ బి1, బి2, బి12, మెగ్నీషియం, పొటాషియం మరియు ఇతర పదార్థాలు ఉంటాయి. అయితే పాలను తీసుకునేటప్పుడు మాత్రం ఈ పదార్థాలను అస్సలు కలిపి తీసుకోకూడదు. మరి ఆ ఆహార పదార్థాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. ఆయుర్వేదం ప్రకారం పాలను తీసుకునేటప్పుడు సిట్రస్ ఫ్రూట్స్ ను తీసుకోవడం మంచిది కాదు.

పాలతో సీతాఫలం, మామిడి, అరటి పండ్లు లాంటివి కలిపి తీసుకోకూడదు. అదే విధంగా సిట్రస్ ఫ్రూట్స్ తో పాలు లేదా పెరుగు కూడా కలిపి తీసుకోకూడదు. అరటి పండ్లని పాలతో కలిపి తీసుకుంటే గ్యాస్ యాసిడ్ ఏర్పడుతుంది. దీనితో ఇది పేగులకి వెళ్లి సమస్యకు దారి తీస్తుంది. అరటి పండుని కనుక పాలతో తీసుకుంటే జలుబు, దగ్గు, అలర్జీ, శరీరంపై దద్దుర్లు లాంటివి కూడా వస్తూ ఉంటాయి.

అశ్వగంధ తో పాటు పాలు తీసుకుంటే మంచి నిద్ర పొందొచ్చు. రాత్రిపూట పాలు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. నిద్రపోవడానికి అరగంట ముందు పాలు తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. కాబట్టి పాలు తీసుకునేటప్పుడు ఈ తప్పులు చేయకుండా ఆరోగ్యంగా ఉండండి. అలానే సమస్యలు లేకుండా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news