దేశ ప్రజలకు కేంద్రం శుభవార్త..త్వరలోనే డెంగ్యూ, టీబీకి వ్యాక్సిన్లు

-

దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. డెంగ్యూ, టీబీకి వ్యాక్సిన్లపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. త్వరలో అందుబాటులోకి డెంగ్యూ, టీబీకి వ్యాక్సిన్లు రానున్నట్లు ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. రాజ్యసభ లో విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవియ జవాబు ఇచ్చారు. అమెరికాలో 9 నుంచి 16 ఏళ్ళ మధ్య పిల్లల కోసం డెంగ్యూ వాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిందని ఆయన తెలిపారు.

భారత్‌లో కూడా డెంగ్యూ నివారణకు ఈ తరహా వాక్సిన్‌ తీసుకువచ్చే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందా అని ఈరోజు రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించారు వి.విజయసాయి రెడ్డి. ఆ ప్రశ్నకు కూడా జవాబు ఇచ్చారు ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవియ. కేంద్ర ప్రభుత్వం టీబీ, డెంగ్యూ జబ్బులకు వాక్సిన్లను అభివృద్ధి చేస్తోందని తెలిపారు. వాక్సిన్‌ నిపుణుల ఆమోదం, సిఫార్సుల అనంతరం ఈ రెండు వాక్సిన్లను ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తెస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవియ సమాధానం ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news