వర్షాకాలంలో ఈ ఆహారపదార్ధాలని తీసుకోకండి..!

-

వర్షాకాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. అయితే వర్షాకాలం (Rainy season)లో ఈ ఆహారం తీసుకోవడం మంచిది కాదని డాక్టర్లు అంటున్నారు. మరి ఆలస్యం ఎందుకు వాటి కోసం మనం ఇప్పుడే చూసేద్దాం.

వర్షాకాలం /Rainy season
వర్షాకాలం /Rainy season

వర్షాకాలంలో త్వరగా ఇన్ఫెక్షన్ కి గురి అయి పోతామని.. కనుక ఇటువంటి సమయంలో ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటే అంత మంచిది అని డాక్టర్లు చెబుతున్నారు. వర్షాకాలం సమయంలో పానీపూరి వంటి వాటిని తినకుండా ఉండడం మంచిదని.. ఈ వర్షాకాలంలో బ్యాక్టీరియా మరియు క్రిములు ఎక్కువగా సోకె ప్రమాదం ఉంటుందని డాక్టర్ చెప్తున్నారు.

వర్షాకాలంలో ఈ ఆహారం అస్సలు తీసుకోవద్దు:

వేయించిన ఆహారం:

చాలామంది వర్షాకాలంలో వేడి వేడిగా బయట వేయించిన ఆహారం తీసుకుంటూ ఉంటారు. అయితే వీటిని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. సమోసా మొదలైన వాటిని తీసుకోవడం వల్ల గ్యాస్ సంబంధించిన సమస్యలు వస్తాయని అంటున్నారు. కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది.

ఆకుకూరలు:

వర్షాకాలంలో ఆకు కూరలు తీసుకోవడం మంచిది కాదు. ఎక్కువగా వర్షాకాలంలో వీటిలో దుమ్ము వంటివి ఉంటాయి. దీని కారణంగా క్రిములు సులువుగా అంటుకుంటాయి. కాబట్టి పాలకూర, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి వాటిని వర్షాకాలంలో తీసుకోవద్దు.

బయట చేసే పండ్ల రసాలు:

పండ్లు వంటివి బయట రోడ్డు పక్కన పెట్టి…. వాటిని జ్యూస్ చేస్తారు. ఎక్కువ సేపు ఇవి చల్లగా ఉండిపోవడంతో క్రిములు అంటుకుపోయి ఉండిపోతాయి. వాటిని జ్యూస్ చేసి బయట ఇస్తూ ఉంటారు. కాబట్టి బయట జ్యూస్లు వంటి వాటిని తాగకుండా ఇంట్లో చేసుకోవడం మంచిది. అలానే వర్షాకాలంలో చేపలు వంటి వాటిని తీసుకోవడం మంచిది కాదు.

Read more RELATED
Recommended to you

Latest news