బాడీ స్ప్రే కెమికల్ టెస్ట్ ను ఇలా ఇంట్లోనే చేసేయండి..!

-

టిప్ టాప్ గా రెడీ అవడంలో..మేకప్ ఎంత ఇంపార్టేంటో..బాడీ స్ప్రే కూడా అంతే ముఖ్యమైంది. ముఖ్యంగా అబ్బాయిలైతే..పెద్దగా ఏం రెడీకారు..నీట్ గా హ్యాంగర్ కున్న షట్ వేసుకుని..అలాఅలా సెంటుకొట్టు కుంటే చాలు..అదిరిపోతుంది. ఇలా అందరికి రెడీ అవటంలో బాడీ స్ప్రే ప్రత్యేకం అయిపోయింది. అయితే ఇది ఉపయోగించుకోవటంలో కొన్ని అనర్థాలు ఉన్నాయట..అవేంటో ఇప్పుడు చూద్దాం.

బాడీ స్ప్రే లో కెమికల్స్ ఉన్నాయో లేవో ఇలా చెక్ చేసుకోవచ్చు:

బాడీ స్ప్రే వల్ల శరీరానికి హాని కలుగుతుంది. ఒక కొవ్వొత్తిని వెలిగించి మీరు బాడీ స్ప్రే తీసి దాని మీద స్ప్రే చేస్తే మంట పైకి రావడాన్ని మనం గమనించవచ్చు. కెమికల్స్ ఉంటేనే అలా వస్తుంది. ఇలా చర్మానికి హాని చేసే వాటిని ఉపయోగించడం వల్ల చర్మం పై సమస్యలు వస్తాయి. మీరు వాడే బాడీ స్ప్రే వల్ల హాని కలుగుతుంది లేదా అనేది పిల్లలకు తెలిసేలా చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి.

ఒక కాగితం తీసుకుని దాని మీద పెన్ తో గీతలాగ పెట్టి దాని మీద బాడీ స్ప్రే కొట్టి వేలు తో టచ్ చేసి చూస్తే కెమికల్స్ ఉంటే కాగితం నుండి ఇన్క్ మొత్తం వచ్చేయడాన్ని మనం చూడొచ్చు. ఒకవేళ కెమికల్స్ లేవు అంటే ఇన్క్ అంటుకోదు. బాడీ స్ప్రే లో ఉండే కెమికల్ వల్ల స్కిన్ క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

ఇంకా అండర్ ఆర్మ్స్ నల్లగా మారడానికి కారణం కూడా బాడీ స్ప్రేనే అవుతుంది. మనకు వీటిపై పెద్దగా అ‌వగాహన లేకపోవటంతో..విరివిగా బాడీ స్ర్పే వాడేస్తుంటాం. చర్మానికి డైరెక్టుగా వాడే ప్రొడెక్ట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నాణ్యతలేనివి అసలే ఉపయోగించకూడదు. చాలా మంది ఇటువంటివి తెలియక బాడీ స్ప్రే వంటివి వాడుతుంటారు. కాబట్టి బాడీ స్ప్రే ని వాడేటప్పుడు కెమికల్స్ లేకుండా ఉండే వాటిని వాడేందుకు ప్రయత్నం చేయండి. ఇలా కాగితం ఎక్స్పరిమెంట్ లేదా క్యాండిల్ ఎక్స్పరిమెంట్ ద్వారా మీరు మీ బాడీ స్ప్రే ని వాడొచ్చా లేదా అనేది తెలుసుకోవచ్చు. అయితే దాదాపు అన్నింటిలో కెమికల్ ఉంటుంది. కాకపోతే..కాస్తైనా ఈ కెమికల్ కంటెంట్ తక్కువ ఉండేవాటిని యూస్ చేసేందుకు ప్రయత్నించటం మంచిదే కదా..!

Read more RELATED
Recommended to you

Latest news