నీలోఫర్ హాస్పిటల్ లో “శిశు విహార్” వార్డు ప్రారంభం

-

హైదరాబాద్ : నీలోఫర్ హాస్పిటల్ లో శిశు విహార్ వార్డు ప్రారంభించారు మంత్రి సత్యవతి రాథోడ్. అనంతరం.. చిన్న పిల్లల కోసం బాల రక్షక్ వాహనాలను కూడా మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యల తో బాధపడుతున్న శిశువిహార్ పిల్లల కోసం ప్రత్యేకంగా నిలోఫర్ ఆసుపత్రిలో వార్డు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

10 బెడ్స్ తో కూడిన వార్డ్ ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖకు పెద్దపీట వేశారన్నారు. వైద్య ఆరోగ్య శాఖ బలోపేతం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ 10 వేల కోట్లను ఖర్చు పెట్టనున్నారని తెలిపారు. కోవిడ్ లో వైద్యలు ప్రాణాలకు తెగించి పని చేసారు,ఇక ముందు కూడా అలాగే పని చేయాలని కోరారు. ఆరోగ్య తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుతునందుకు గిరిజన బిడ్డ గర్వపడుతున్నానని తెలిపారు మంత్రి సత్యవతి రాథోడ్.

Read more RELATED
Recommended to you

Latest news