చాలామందికి జుట్టు పెద్ద సమస్యగా మారుతుంది. చుండ్రు, వెంట్రుకలు పలుచబారడం, మృదువుగా ఉండకపోవడం, జుట్టు ఊడిపోవడం, పెరుగుదలలో లోపం వంటి సమస్యల కారణంగా చికాకు వస్తుంటుంది. అందువల్ల ఇలాంటి సమస్యల నుండి బయటపడడానికి ఎన్నో రకాల ప్రోడక్టులు వాడుతుంటారు. అవన్నీ ఖరీదుతో కూడుకున్నవై ఉంటాయి. ఆ కారణంగా చాలామంది వాటి జోలికి వెళ్ళను కూడా వెళ్ళరు. ఐతే ఇలాంటి సమస్యల నుండి బయటపడడానికి ఇంట్లోనే తయారు చేసుకునే షాంపూ గురించి ఈ రోజు తెలుసుకుందాం.
శిరోజాల పెరుగుదల, మృదుత్వం మొదలగు వంటి వాటికి బాగా సాయపడే షాంపూని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ముందుగా దీనికి కావాలని పదార్థాలు ఏంటో చూద్దాం.
పావు కప్పు కుంకుడుకాయ పొడి
పావు కప్పు శీకాకాయ పొడి
పావు కప్పు మెంతుల పొడి.
ఒక పాత్రలో వేడినీళ్ళు గానీ, లేదా గ్రీన్ టీ గానీ తీసుకుని అందులో ఈ మూడు పొడర్లని వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని జుట్టుకి బాగా పట్టించాలి. అలా ఒక అరగంట సేపు ఉంచుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది.
ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చుండ్రు లాంటి సమస్యలు పోవడమే కాకుండా శిరోజాలు మృదువుగా తయారవుతాయి. శీకాకాయలో ఉన్న గుణం వల్ల జుట్టు బాగా పెరిగి అందంగా కనిపిస్తుంది. అంతేకాదు తలభాగం చల్లగా ఉండడానికి శీకాకాయ బాగా తోడ్పడుతుంది. ఇక మెంతుల పొడి వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుముఖం పడుతుంది.
సో.. ఇంకేం, జుట్టు సమస్యల నుండి బయటపడి అందమైన వెంట్రుకలు కావాలనుకుంట మీరు కూడా ఇలా ప్రయత్నించండి.