నాగార్జునసాగర్ బై పోల్..అభ్యర్దుల పై క్లారిటీ వచ్చినట్టుందే !

-

నాగార్జునసాగర్ ఉపఎన్నిక పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. గత ఎన్నికల్లో పోగొట్టుకున్న స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని కాంగ్రెస్, మరోసారి జెండా ఎగురవేయాలని టీఆర్ఎస్ బావిస్తున్నాయి. అయితే దుబ్బాక ఫలితాన్ని ఇక్కడ రిపీట్ చేయాలని బీజేపీ తలుస్తోంది.

ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి తో ఖాళీ అయిన నాగార్జున సాగర్ స్థానాన్ని దక్కించుకోవడంపై పార్టీలు దృష్టి సారించాయి. ప్రధాన పార్టీల నుంచి బరిలో నిలిచేందుకు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.సాగర్ బై ఎలక్షన్ లో గెలిచి తమ సత్తా చాటేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. దుబ్బాక ఓటమి , జీహెచ్ఎంసి ఫలితాలు టీఆర్ఎస్ కు అనుకున్న స్థాయిలో లేకపోవడంతో.. సాగర్ లో గెల్చి సత్తా చాటాలని అధికార టీఆర్ఎస్ భావిస్తోంది. అభ్యర్థి ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది టీఆరెస్. ఆనవాయితీ ప్రకారము చనిపోయిన వారి కుటుంబ సభ్యుల కు బై ఎలక్షన్‌ లో అవకాశం కల్పిస్తారు. కానీ దుబ్బాక ఫలితంతో..నోముల కుమారుడు భగత్ కు టికెట్ ఇచ్చేలా కనిపించడo లేదు. సాగర్ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి, తేరా చిన్నప రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు.

ఇక కాంగ్రెస్ నుంచి జానారెడ్డి లేదా ఆయన కొడుకు రఘువీర్ రెడ్డి బరిలో దిగే అవకాశం ఉంది. జానా కుటుంబం బరిలో ఉండడం ఖాయం కావడంతో… పార్టీ కేడర్‌లో ఉత్సాహం కనిపిస్తోంది. మరోవైపు..దుబ్బాక ఉపఎన్నికతో ప్రారంభించి, జీహెచ్ఎంసీ ఎన్నికలలో సత్తా చాటి దూకుడు మీద ఉన్న బీజేపీ ఇప్పుడు నాగార్జునసాగర్ ఉపఎన్నిక పై ఫోకస్ చేసింది.బలమైన అబ్యర్దిని బరిలో దింపి సాగర్ లో జెండా ఎగురవేసేందుకు వ్యూహలు రచిస్తోంది. సాగర్ లో అధికార టీఆరెస్, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని ఎదుర్కొని విజయం సాధించడం అంత తేలికైన విషయం కాదని గ్రహించిన బీజేపీ.. సాగర్ ఉపఎన్నిక లో బీజేపీ జెండా పాతేందుకు వ్యూహాత్మకంగా ముందుకు పోతుంది.

2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి 27 వేల కు పైగా ఓట్లు సాధించిన కడారి అంజయ్యను బీజేపీ నుంచి బరిలోకి దింపే ఆలోచన చేస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.బీజేపీ టికెట్ కోసం కడారి అంజయ్య, కంకణాల శ్రీధర్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news