ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా ఉంటే ఇలా చెయ్యండి..!

-

ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిని శుభ్రంగా వుంచుకోకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. బొద్దింకలు వలన కూడా లేని పోని సమస్యలు వస్తాయి. కొంత మంది ఇళ్లల్లో బొద్దింకలు కూడా ఎక్కువగా ఉంటాయి. నిజానికి బొద్దింకల వల్ల మనం ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ఆహారంలో బొద్దింకలు పడే అవకాశం కూడా ఉంటుంది ఏది ఏమైనా బొద్దింకలు ఉన్న ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీ ఇంట్లో కూడా బొద్దింకలు ఎక్కువగా ఉన్నట్లు అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి. దీనితో ఆ సమస్య నుండి బయట పడవచ్చు. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా ఆ టిప్స్ ని చూసేద్దాం.

మీరు ఎక్కువగా బొద్దింకల సంచరించి చోట లవంగాలను పెట్టండి లవంగాలని పెట్టడం వల్ల ఘాటుకి బొద్దింకలు చేరవు.
బిర్యానీ ఆకులును ఉంచడం ద్వారా కూడా మనం బొద్దింకలను తరిమికొట్టొచ్చు. అందుకని వంట గదుల్లో, డైనింగ్ టేబుల్ వంటి చోట బిర్యానీ ఆకులను కూడా పెడుతూ ఉండండి దీంతో బొద్దింకలు రావు.
వేపాకులు పొడిని గాని వేప నూనె కానీ స్ప్రే చెయ్యండి. దీనితో బొద్దింకలు చేరవు. కాబట్టి ఈ చిట్కాలని కూడా మీరు ఫాలో అవ్వొచ్చు.
అలానే ఇంట్లో తడి ఎక్కువగా ఉండకుండా చూసుకోండి. నేల మీద తడి నిలిచిపోవడం వల్ల బొద్దింకల బెడద ఎక్కువ అవుతుంది అందుకనే తడిగా కాకుండా పొడిగా ఉండేట్టు చూసుకోండి. ఇలా అనుసరించడం వల్ల బొద్దింకలు సమస్య లేకుండా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news