సాధారణంగా జీవితం లో ఒక సారి గెలుపు ఉంటే మరొక సారి ఓటమి ఉంటుంది. గెలుపు, ఓటమి రెండూ కూడా జీవితంలో సాధారణమే. కానీ కొన్ని కొన్ని సార్లు ఓటమి మనం స్వీకరించలేక పోతాము. అటువంటి సమయం లో మనం నెగిటివిటీ కి గురవుతాము. పైగా సెల్ఫ్ ఎస్టీం కూడా విపరీతంగా తగ్గిపోతుంది. ఆ తప్పులని మనం యాక్సెప్ట్ చేయలేక పోతాము. దీంతో మైండ్ సెట్ అంతా కూడా మారిపోతుంది. కొన్ని కొన్ని సార్లు ఫెయిల్యూర్ ఎలా ఉంటుందంటే… దాని నుండి మనం అంత త్వరగా బయటపడలేక పోతాము. అయితే అటువంటి సమయంలో తిరిగి యథాస్థానం లోకి మనం చేరుకోవాలంటే ఈ టిప్స్ ని అనుసరించటం మంచిది. దీని మూలంగా ఫెయిల్యూర్ నుంచి బయట పడడానికి అవకాశం ఉంది.
తప్పు ఎక్కడ చేశారనేది చూసుకోవడం:
ఒకసారి ఓడిపోయిన తర్వాత ఓటమికి గల కారణమేమిటో అనేది చూసుకోవాలి. అది చేయడం వల్ల తిరిగి అటువంటి తప్పులు చేయకుండా ఉండడానికి చూసుకుని.. మరో అవకాశం కోసం ఎదురు చూడడం వల్ల ఫెయిల్యూర్ నుంచి బయటపడవచ్చు.
మీ మైండ్ సెట్ ని మార్చుకోండి:
ఒకసారి ఫెయిల్యూర్ వస్తే మరో సారి కూడా ఫెయిల్యూర్ వస్తుందని అనుకోవద్దు. ప్రతి సందర్భం ఒకే లాగ ఉండదు. నేర్చుకుని నేను సాధిస్తాను… మరోసారి నేను ఇలాంటి తప్పు చేయను.. అని మీకు మీరు సర్దు చెప్పుకోవాలి.
మీ గమ్యాన్ని మీరు చేరడం:
ఇక్కడితో ఆగిపోకుండా మీ మోటివ్ ఏమిటి అనేది తెలుసుకోవాలి. జీవితంలో అనుకున్నది సాధించగలను అని ఫెయిల్యూర్ ని స్వీకరించాలి.