హృదయ ఆరోగ్యం బాగుండాలంటే ఇలా చెయ్యండి..!

-

ఈ మధ్య కాలంలో హృదయ సంబంధిత సమస్యలు ఎక్కువైపోయాయి. గుండె ఆరోగ్యం కోసం మీరు తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుని గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి. గుండె ఆరోగ్యం మెరుగుపడటానికి మంచి ఆహారాన్ని తీసుకోవడం ఎంతో అవసరం. ప్రస్తుతం ఉన్నటు వంటి జీవనశైలిలో జంక్ ఫుడ్ ను ఎక్కువగా తింటున్నారు. వాటివల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గుండె జబ్బులతో పాటు ఊబకాయం వంటి సమస్యలు కూడా వస్తాయి. అయితే గుండె ఆరోగ్యం కోసం ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలనేది ఇప్పుడే తెలుసుకోండి.

 

తృణధాన్యాలు:

తృణధాన్యాలలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. దానితో పాటుగా మంచి పోషక విలువలు లభిస్తాయి. అలానే బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ లో ఉంటుంది మరియు గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి గుండె ఆరోగ్యం కోసం తప్పనిసరిగా తృణధాన్యాలను తీసుకోండి.
ప్రొసెస్డ్ గ్రెయిన్స్ కు బదులుగా వీటిని తీసుకోవడం మేలు.

ప్రోటీన్:

డైరీ ప్రొడక్ట్స్, గుడ్లు, ధాన్యాలు, మాంసం మరియు చేప వంటి వాటిలో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. ఫ్యాట్ ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థానికి బదులుగా మంచి ఆహారాన్ని తీసుకోవాలి. కాబట్టి చేపలను తీసుకోవచ్చు. అధిక క్యాలరీలు కూడా ఉండవు మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. దాంతో కొలెస్ట్రాల్ శాతం తగ్గుతుంది గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

తక్కువ ఆహరం తీసుకోండి:

రోజువారీ ఆహారం కంటే ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాలరీలు పెరిగిపోతూ ఉంటాయి. ప్రతిరోజు అదే పరిస్థితి వస్తే ఊబకాయం కచ్చితంగా వస్తుంది. కాబట్టి రోజువారి ఆహారాన్ని సరైన విధంగా తీసుకోండి మరియు లిమిట్ గా తీసుకోండి.

మొక్కల ద్వారా వచ్చే ఆహారాన్ని తీసుకోండి:

విటమిన్స్, మినరల్స్ అధికంగా కూరగాయలు మరియు పండ్లు లో లభిస్తాయి. అంతేకాకుండా వాటిలో తక్కువ కేలరీలు ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల గుండెకు సంబంధించిన జబ్బులు రాకుండా ఉంటాయి. మీకు ఆకలిగా అనిపించినప్పుడు బిస్కెట్స్ లేదా చిప్స్ వంటి వాటికి దూరంగా ఉండండి. వాటికి బదులుగా పండ్లను తీసుకోండి. జంక్ ఫుడ్ మరియు ప్రాసెస్డ్ ఫుడ్స్ లో అధికంగా క్యాలరీలు ఉంటాయి, వాటి వల్ల కొలెస్ట్రాల్ శాతం పెరుగుతుంది. కాబట్టి అటువంటి ఆహారాన్ని తీసుకోకండి. ఇలా ఈ టిప్స్ ని పాటిస్తే గుండె జబ్బులకి దూరంగా ఉండచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news