ఐపీఎల్ – 2022 లో రెండు కొత్త జట్లు ఫైనల్… కొనుగోలు చేసిన అదానీ గ్రూప్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మరో రెండు కొత్త జట్లు ఖరారు అయ్యాయి.ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ లో కొత్త జట్లుగా అహ్మదాబాద్, లక్నో జట్లు ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇవాళ జరిగిన… ఇండియన్ ప్రీమియర్ లీగ్ బోర్డు సమావేశంలో ఈ రెండు జట్ల పేర్లు ఫైనల్ అయ్యాయి.

ఇక అహ్మదాబాద్ జట్టును అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. అలాగే లక్నో జట్టు ను కొనుగోలు చేసింది ఆర్పీఎస్జీ గ్రూప్. అయితే అహ్మదాబాద్ జట్టు ను ధర 5,600 కోట్లకు… అదాని గ్రూప్ కొనుగోలు చేసినట్లు సమాచారం అందుతోంది.

అలాగే లక్నో జట్టు ధర 7,090 కోట్లకు RPSG గ్రూప్ కొనుగోలు చేసినట్లు సమాచారం. మొత్తానికి 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ లో… కొత్తగా అహ్మదాబాద్ మరియు లక్నో జట్లు బరిలోకి దిగనున్నాయి. దీంతో ఐపీఎల్ టోర్నీ జట్ల సంఖ్య 8 నుంచి 10 కి చేరనుంది. ఇక ఐపీఎల్ 15 వ సీజన్ వచ్చే ఏడాది ఏప్రిల్ మాసం లో ప్రారంభమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.