రోజు కొన్ని కొంత విషయాలు తెలుసుకుంటూ ఉంటే.. నాలెడ్జ్ పెరుగుతుంది. అంతే కాదు.. సమాజం పై అవగాహన కూడా ఎక్కువవుతుంది. మీకు తెలుసా..ఊకే మొఖం ముడుచుకుంటూ ఉంటే.. త్వరగా ముడతలు వస్తాయట. స్మోకింగ్ వల్ల లంగ్స్ ఒక్కటే కాదు.. అంగస్తంభన సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉందట. ఇంకా ఇలాంటి కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు ఈరోజు మీకోసం..
కౌగలింత సమయంలో ఎలాగైతే స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయో.. తల్లితో మాట్లాడేటప్పుడు కూడా అదే స్థాయిలో స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయట
ఊపిరి బిగపట్టి.. మూడుసార్లు మింగినట్లు (swallowing) చేస్తే.. ఎక్కిళ్లు (hiccups) ఆగుతాయట. ఈ సారి ట్రై చేయండి.
చార్లెస్ ఓస్బోర్న్ (Charles Osborne) అనే వ్యక్తికి 68 ఏళ్లపాటూ ఎక్కిళ్లు (hiccups) వచ్చాయి.
తరచూ ముఖం చిట్లించే (frowns) వారికి ఫేస్‌పై త్వరగా ముడుతలు వస్తాయి. జాగ్రత్తండోయ్.. కాస్త నవ్వండి.
typewriter అనే పదాన్ని కీబోర్డులోని పై వరుస కీలతోనే టైప్ చెయ్యగలం. ఇంకా అలాంటి పదాలు ఏమైనా ఉన్నాయోమో చూడండి.
స్మోకింగ్ వల్ల అంగస్తంభన సమస్య (erectile dysfunction) వచ్చే అవకాశాలు రెట్టింపుగా ఉంటాయి.
మేఘాలను చూసి భయపడటాన్ని నెఫోఫోబియా (Nephophobia) అంటారు.
వాన చినుకు గంటకు 27 కిలోమీటర్ల వేగంతో భూమికి చేరుతుంది.
అనుకున్నంత మంచిది కాదేమో అని భయపడటాన్ని అటెలోఫోబియా (Atelophobia) అంటారు
స్కిజోఫ్రేనియా (Schizophrenia) సమస్య ఉన్నవారు తమకు తాము కితకితలు (tickle) పెట్టుకోగలరు
ప్రతి పది మందిలో ఒకరికి శాడిస్ట్ లక్షణాలు (psychopaths) ఎక్కువగా ఉంటాయట.
మద్యం తాగేవారు సంవత్సరానికి సగటున 8 నుంచి 12 సార్లు తీవ్రమైన హ్యాంగోవర్ సమస్యను ఎదుర్కొంటున్నారు.
చంకలో ప్రతి చదరపు సెంటీమీటర్‌కీ 10 లక్షల బ్యాక్టీరియా ఉంటాయి. అందుకే బాగా క్లీన్ గా ఉంచుకోవాలి.
కాలి వేళ్ల గోర్ల కంటే… చేతి వేళ్ల గోర్లు 4 రెట్లు వేగంగా పెరుగుతాయి.
పొగాకు (tobacco) వల్ల ప్రతి 8 సెకండ్లకూ ఒకరు చనిపోతున్నారు.