కోటక్ మహీంద్రా బ్యాంక్ తన కస్టమర్లకు బ్యాడ్ న్యూస్. తాజాగా ఈ బ్యాంక్ ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ల పై వడ్డీ రేట్లు సవరించింది. దీని మూలంగానే బ్యాంకులో డబ్బులు దాచుకునే వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అక్టోబర్ 22 నుంచే బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం అమలులోకి వచ్చింది.
మీరు ఇప్పుడు కనుక మీ డబ్బులు ఎఫ్‌డీ చేయాలని అనుకుంటే మీకు ఇప్పుడు గతంలో కన్నా తక్కువ రాబడి వస్తుంది. దీనితో ఇప్పుడు బ్యాంకులో డబ్బులు ఎఫ్‌డీ చేస్తే కేవలం 2.5 శాతం నుంచి 5 శాతం మధ్యలో వడ్డీ లభిస్తుంది. 7 రోజుల నుంచి 30 రోజులు, 31 రోజుల నుంచి 90 రోజులు, 91 రోజుల నుంచి 179 రోజుల కాల వ్యవధిలో మెచ్యూరిటీ కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వరుసగా 2.5 శాతం, 3 శాతం, 3.5 శాతం చొప్పున వడ్డీ వస్తుంది. ఒకవేళ 180 రోజుల నుంచి ఏడాదిలోపు ఉండే ఎఫ్‌డీలపై కోటక్ మహీంద్రా బ్యాంక్ 4.5 శాతం వడ్డీ రేటు అందిస్తోంది.
అదే ఏడాది నుంచి 389 రోజుల కాల పరిమితిలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.6 శాతం వడ్డీ వస్తుంది. ఇక 391 రోజుల నుంచి 23 నెలలలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.9 శాతం వడ్డీని పొందొచ్చు. అదే ఐదేళ్ల నుంచి పదేళ్ల కాల పరిమితి లోని ఫిక్స్‌డ్ డిపాజిట్ల పై మీకు 4.5 శాతం వడ్డీ లభిస్తుంది. అదే మీరు సీనియర్ సిటిజన్ అయితే 50 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ వస్తుంది. ఇలా ఎఫ్‌డీ లపై కోటక్ మహీంద్రా బ్యాంక్ వడ్డీ రేట్లు ఉన్నాయి.