ప్రతీరోజూ పండగే సినిమా తర్వాత సోలో బ్రతుకే సో బెటరు సినిమాతో వస్తున్న సాయి ధరమ్ తేజ్, ఆ తర్వాతి చిత్రాన్ని దేవకట్టా దర్శకత్వంలో చేస్తున్నాడు. వెన్నెల, ప్రస్థానం వంటి రెండు విభిన్నమైన చిత్రాలని తెరకెక్కించి, ఆటో నగర్ సూర్య తో వైఫల్యం మూట గట్టుకున్న దేవకట్టా, ఈ సారి మరో వైవిధ్యమైన కథతో వస్తున్నాడట. సాయి తేజ్ కెరీర్లో ఇంతవరకూ చేయని పాత్రలో కనిపిస్తాడట. పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంగా రూపొందుతున్న ఈ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది.
రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలని టచ్ చేయని సాయి తేజ్ మొదటిసారిగా ప్రయోగం చేస్తున్నాడు. అది కూడా విజయాల్లో లేని డైరెక్టర్ తో కావడం విశేషం. మరి వరుస హిట్లతో దూసుకుపోతున్న సాయి తేజ్ కి దేవకట్టా తో సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఈ సినిమాలో రమ్యక్రిష్ణ మరో ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారు.