ఎన్టీఆర్ యాడ్ కోసం ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా..?

-

RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది అని చెప్పవచ్చు.. ఇండియాలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లినా కూడా అక్కడ ఆ భాషలో మాట్లాడుతూ అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. RRR సినిమా ఇప్పటికే విడుదలై ఏడాది కావస్తున్నా ఇంకా తన తదుపరి చిత్రంపై ఏ విధంగా స్పందన రాలేదు. ఎన్టీఆర్ -30 వ సినిమాని ప్రకటించి ఇప్పటికీ ఎన్నో నెలలు కావొస్తున్నా ఏ విధమైనటువంటి అప్డేట్ ప్రకటించలేదు.

ఈ క్రమంలోని ఎన్టీఆర్ కు సంబంధించి పలు ఫోటోలు వైరల్ గా మారడంతో.. ఎన్టీఆర్ సినిమా కోసమే ఇలా మారారంటూ పలు కథనాలు వినిపించాయి. అయితే తాజాగా ఒక మార్కెట్ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ యాడ్ షూట్ లో పాల్గొన్నారు. ఈ యాడ్ నెట్టింట వైరల్ గా మారడంతో పాటు అందుకు సంబంధించిన లుక్ కూడా వైరల్ గా మారుతున్నది. ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ అయినా లైషియస్ కోసం యాడ్ షూట్ చేయడం జరిగింది.. ఎన్టీఆర్ ,రాహుల్ రామకృష్ణతో కోర్టులో చేసిన ఈ యాడ్ సీన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

ఎన్టీఆర్ ఈ యాడ్ కోసం ఎంత తీసుకున్నారు అనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక ఎన్టీఆర్ ఈ యాడ్ కోసం దాదాపుగా రూ.3.75 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ ఇంత తక్కువ తీసుకోవడంతో అభిమానులు అందరూ ఆశ్చర్యపోతున్నారు. గతంలో కూడా ఎన్టీఆర్ యాడ్ల రెమ్యూనరేషన్ చాలా తక్కువగానే తీసుకున్నారు. మరి రాబోయే రోజుల్లో మరిన్ని యాడ్లలో నటించి ప్రేక్షకులను అలరిస్తారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news