నేనూ అక్కడి నుంచే పోటీ చేస్తా :తీన్మార్ మల్లన్న

-

తెలంగాణలో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా ఇప్పటినుంచే ఎన్నికల వేడి పెరుగుతోంది. అయితే.. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే.. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే తాను కూడా అక్కడి నుంచే పోటీ చేస్తానని తీన్మార్ మల్లన్న ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సత్తుపల్లిలో నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు తీన్మార్‌ మల్లన్న. తాను ప్రవేశపెట్టిన రెండుమూడు రోజుల్లోనే ప్రభుత్వాన్ని రద్దు చేసి కేసీఆర్ ఎన్నికలకు వెళ్తారన్న సమాచారం తనవద్ద ఉందన్నారు. రానున్న రోజుల్లో మల్లన్న బృందం రాజకీయ పార్టీగా మారుతుందన్నారు. ప్రజల పక్షాన పోరాడే తమను ప్రజల్లో తిరగనీయకుండా పోలీసుల ద్వారా అడ్డుకుంటున్నారని, తమ పాదయాత్రకు అనుమతులు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

Meet 'Teenmaar Mallanna,' the journalist taking on TRS and Cong in  Huzurnagar bye-poll | The News Minute

 

కేసీఆర్ రాజ్యంలో పాదయాత్రలు చేయాలంటే కోర్టుల అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయన్నారు. పాదయాత్రలో తన ప్రసంగాల ద్వారా గొత్తికోయలు మావోయిస్టుల్లో చేరుతారని పోలీసులు పేర్కొన్నారని, తన ప్రసంగాలతో ఇప్పటి వరకు ఎంతమంది అలా చేరారో చెప్పాలని మల్లన్న డిమాండ్ చేశారు.కాగా, తీన్మార్ మల్లన్న చేపట్టిన ‘7200 ఉద్యమ పాదయాత్ర’కు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ అనుమతి నిరాకరించడంతో తాత్కాలికంగా బ్రేక్ పడింది. పాదయాత్రలో భాగంగా నిన్న సత్తుపల్లిలోని జీవీఆర్, కిష్టారం ఓసీల్లో మల్లన్న పర్యటించారు. కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు తీన్మార్‌ మల్లన్న.

Read more RELATED
Recommended to you

Latest news