భర్త వల్ల రోజా ఎన్ని కోట్లు పోగొట్టుకుందో తెలుసా..?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్ రోజా ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూనే ఎన్నో చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించింది. అయితే ఈ మధ్య ఇండస్ట్రీకి దూరమైన ఈమె పలు బుల్లితెర షోలలో బాగానే అలరించింది. ఇక ప్రస్తుతం రాజకీయాలలో కూడా తనదైన అవా కొనసాగిస్తూ ఉంది రోజా. రోజా కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా నటిగా మెప్పించింది. రోజా చిత్తూరు జిల్లాలో జన్మించింది. సినిమాల మీద ఆసక్తితోని సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత రాజకీయంగా ఎదిగింది. ప్రస్తుతం రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ గా ఇమేజ్ సంపాదించుకుంది రోజా.

టాలీవుడ్ లో అప్పట్లో అగ్ర హీరోల అందరితో నటించింది రోజా. అయితే తమిళ డైరెక్టర్ అయిన సెల్వమణి ని వివాహం చేసుకున్న తర్వాత ఈమెకు అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో నిర్మాణ వసంస్థను స్థాపించి అనేక చిత్రాలను తెరకెక్కించింది. అందులో తన భర్త దర్శకుడుగానే ఉంటూ ఎన్నో చిత్రాలను తెరకెక్కించారు. అయితే రోజా నిర్మించిన సినిమాలకు భారీగా ఖర్చు చేయడం వల్ల ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి . దీంతో నష్టాలను కూడా చవి చూడవలసి వచ్చిందట.

ఇక అంతే కాకుండా ఆ సమయంలో రాజకీయాలలో ఎంట్రీ ఇవ్వడంతో ఆర్థికంగా చాలా కుదేలు అయిందట రోజా. ఇక దాదాపుగా రూ.30 కోట్ల రూపాయలను కొన్ని సంవత్సరాల క్రితమే పోగొట్టుకున్నట్టుగా సమాచారం. ఆ సమయంలోని జబర్దస్త్ ఆఫర్ రావడంతో అక్కడ రెమ్యూనరేషన్ అత్యధికంగా ఇవ్వడంతో ఆమె కాస్త కోలుకుందని సమాచారం. అందుచేతనే రోజా అప్పుడప్పుడు జబర్దస్త్ తన జీవితంలో ఒక కీలకమని తెలియజేస్తూ ఉంటుంది. త్వరలోనే రోజా తన కూతురి అన్షు ని కూడా హీరోయిన్ గా చేసేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మల్టీ టాలెంటెడ్ కలిగిన అన్షు సినిమాలలో హీరోయిన్గా ఎలా గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news