ఇతరులతో మాట్లాడటం కమ్యూనికేషన్ చేయడం ఇవన్నీ కూడా చాలా మంచి లక్షణాలు. కానీ ఆచార్య చాణక్య అన్ని విషయాలను ఇతరులతో షేర్ చేసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు. నిజానికి ఈ విషయాలను కనుక వేరే వాళ్ళతో చెబితే దానివల్ల మీరే నవ్వులపాలవుతారని అంటున్నారు. అయితే మరి ఇతరులతో ఎలాంటి విషయాలని చెప్పకూడదు..? ఎటువంటివి చెప్తే నవ్వులపాలవుతారు అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
మీ ఇంట్లో ఉండే సమస్యలను చెప్పకూడదు:
మీరు కనుక మీ ఇంట్లో ఉండే లోటుపాట్లను సమస్యలను ఇతరులతో చెప్పారంటే దాని వలన మీరే నవ్వులపాలవుతారు. మీకే అపకీర్తి వస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండే సమస్యలను ఇతరులతో చెప్పుకోకూడదు. ఒక్కొక్కసారి శత్రువులు దీనిని సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
దానం గురించి చెప్పద్దు:
ఎప్పుడు కూడా మీరు చేసే మంచి పనులు దానాల గురించి చెప్పకూడదు. ఇలా చెప్పకుండా ఉండటం వల్ల మంచి ఫలితం ఉంటుంది దానధర్మాలు చేయడం వల్ల కర్మ భారం తగ్గుతుందని ఆచార్య చాణక్య అంటున్నారు.
వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలు:
భార్యాభర్తల వైవాహిక జీవితం గురించి ఇతరులతో చెప్పుకోకూడదు దీని వలన సమస్యలు ఎక్కువవుతాయి. భార్యాభర్తల మధ్య జరిగే విషయాలు మూడో కంటికి తెలియకూడదు. ఇలా వీటిని ఇతరులతో పంచుకోవడం మంచిది కాదు. వీటిని పంచుకుంటే మీరే నవ్వులపాలవుతారని చాణక్య అంటున్నారు.