హీరో నిఖిల్, హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ -2. డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ పిక్చర్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఇక ఈ సినిమా ద్వారకా నగరం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించడం జరిగింది. ఆగస్టు 13న ఈ సినిమా విడుదలై మొదటి షో తోనే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. తెలుగులోనే కాకుండా ఈ సినిమా విడుదలైన ప్రతి చోట కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్ల విషయానికి వస్తే..
1). నైజాం-13.18 కోట్ల రూపాయలు.
2). సిడెడ్-5.1 కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-4.51 కోట్ల రూపాయలు.
4). ఈస్ట్-2.61 కోట్ల రూపాయలు.
5). వెస్ట్-1.68 కోట్ల రూపాయలు.
6). గుంటూరు-2.78 కోట్ల రూపాయలు
7). కృష్ణ-2.26 కోట్ల రూపాయలు.
8). నెల్లూరు- 1.10 లక్షలు.
9). ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ.33.13 కోట్ల రూపాయలు రాబట్టింది.
10). రెస్ట్ ఆఫ్ ఇండియా-2.92 కోట్ల రూపాయలు.
11). ఓవర్సీస్-6.55 కోట్ల రూపాయలు.
12). మిగిలిన వెర్షన్లు- హిందీ వెర్షన్-15.50 కోట్ల రూపాయలు.
12). ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే రూ. 58.10 కోట్ల రూపాయలు రాబట్టింది.
కార్తికేయ-2 సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే..17.25 కోట్ల రూపాయలు జరగగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.18 కోట్ల వరకు రాబట్టాల్సి ఉన్నది. ఈ చిత్రం ముగిసే సమయానికి ఏకంగా రూ.58.10 కోట్ల రూపాయలను రాబట్టి త్రిబుల్ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఇక ఈ సినిమాతో బయ్యర్లకి దాదాపుగా రూ 40.10 కోట్ల రూపాయలు లాభాన్ని అందించింది. అటు నిఖిల్ డైరెక్టర్ చందు మొండేటి కెరియర్ లోనే ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.