Adipurush : రూమర్స్ కు చెక్.. సంక్రాంతి బరిలోనే “ఆదిపురుష్”

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం ”ఆదిపురుష్”. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కృతి సనన్ – సైఫ్ అలీ ఖాన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.


ఈ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు వున్నాయి ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టు కొనేలా లేదని , గ్రాఫిక్స్ బాగా లేవని సోషల్ మీడియాలో కొంతమంది ట్రో ల్ చేశారు. ఇది ఇలా ఉండగా… ఇవాళ దివాలి పండుగ.

ఈ నేపథ్యంలోనే.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కు అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది ”ఆదిపురుష్” చిత్ర బృందం. అయితే ఆదిపురుష్ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకోనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి బరి నుంచి తప్పుకుని.. సమ్మర్ లో రిలీజ్ అవుతుందని ప్రచారం జరిగింది. అయితే… దీపావళి కానుకగా మరోసారి చిత్ర బృందం రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాలో జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభాస్ తో ఉన్న చిన్న వీడియోలు రిలీజ్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news