ప్ర‌పంచ వ్యాప్తంగా వాట్సాప్‌లో రోజూ యూజ‌ర్లు పంపుకునే మెసేజ్‌ల సంఖ్య ఎంతో తెలుసా..?

-

వాట్సాప్‌.. ప్ర‌పంచంలో అత్య‌ధిక మంది యూజ‌ర్లు ఉప‌యోగిస్తున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ల‌లో మొద‌టి స్థానంలో ఉంది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను యూజ‌ర్ల‌కు అందిస్తూ వ‌స్తోంది. అయితే ఒక రోజుకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న వాట్సాప్ యూజ‌ర్లు ఎన్ని మెసేజ్‌ల‌ను పంపుకుంటారో తెలుసా..? అక్ష‌రాలా 10వేల కోట్లు. అవును.. నిజ‌మే. సాక్షాత్తూ సీఈవో జ‌క‌ర్ బ‌ర్గ్ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

do you know how many messages are sent in one day in whatsapp app

వాట్సాప్ మాతృసంస్థ ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ తాజాగా వాట్సాప్‌కు చెందిన ప‌లు వివ‌రాల‌ను ప్ర‌క‌టించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా వాట్సాప్‌తోపాటు ఇత‌ర ఫేస్‌బుక్ యాప్‌ల‌ను వాడుతున్న వారి సంఖ్య 250 కోట్లుగా ఉంద‌న్నారు. ఇక అడ్వ‌ర్ట‌యిజ‌ర్ల సంఖ్య 1 కోటి వ‌ర‌కు ఉంద‌ని తెలిపారు.

కాగా 2017లో న్యూ ఇయ‌ర్ ఈవ్ సంద‌ర్భంగా ఒక్క రోజే 6300 కోట్ల మెసేజ్‌ల‌ను వాట్సాప్‌లో పంపుకున్నార‌ని, 2018 న్యూ ఇయ‌ర్ ఈవ్ రోజు 7500 కోట్లు, 2019 న్యూ ఇయర్ ఈవ్ రోజు 10వేల కోట్ల మెసేజ్‌ల‌ను వాట్సాప్‌లో పంపుకున్నార‌ని జుక‌ర్‌బ‌ర్గ్ తెలిపారు. అప్ప‌టి నుంచి ప్ర‌పంచ వ్యాప్తంగా నిత్యం వాట్సాప్‌లో 10వేల కోట్ల మెసేజ్‌ల‌ను యూజ‌ర్లు పంపుకుంటున్నార‌ని అన్నారు. కాగా ఈ ఏడాది జ‌న‌వ‌రి వ‌ర‌కు ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై వాట్సాప్ 500 కోట్ల డౌన్‌లోడ్ల‌ను పూర్తి చేసుకుంద‌న్నారు.

Read more RELATED
Recommended to you

Latest news