రేపే అమెరికా మహా సంగ్రామం…!

-

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు.. ఇక కొన్ని గంటల సమయమే ఉంది. దీంతో కీలకమైన బ్యాటిల్‌ గ్రౌండ్‌ స్టేట్స్‌పై దృష్టిపెట్టారు ట్రంప్‌, బైడెన్‌. మరోవైపు ముందస్తు ఓటింగ్‌ జోరుగా సాగుతోంది. ఇప్పటికే దాదాపు పదికోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలుస్తోంది.

ప్రపంచ దేశాలపై ఆదిపత్యం చెలాయించే అమెరికా దేశ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే తదుపరి నేత ఎవరో తేల్చే ఎన్నికలు రేపు జరగనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్‌ మంగళవారం అమీ తుమీ తేల్చుకోనున్నారు. అఖండ విజయంతో మళ్లీ తాను అధ్యక్ష పీఠమెక్కడం లాంఛనమే అని ట్రంప్‌ ధీమా వ్యక్తం చేస్తున్నా.. అదంత సులభంగా ఏమీ కనిపించట్లేదు. ట్రంప్‌పై బైడెన్‌దే పైచేయి అని అనేక సర్వేలు చెబుతున్నాయి. కొవిడ్‌ ముప్పు పొంచిఉండటంతో నేపథ్యంలో ఇప్పటికే భారీగా అమెరికన్లు పోస్టల్‌ , ముందస్తు బ్యాలట్ల రూపంలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

మరోవైపు పోలింగ్‌ తేదీ దగ్గరపడే కొద్దీ.. అమెరికాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇది ట్రంప్‌కు మైనస్‌గా మారుతోందని ప్రచారం జరుగుతోంది. ట్రంప్‌ కంటే జో బైడెన్‌ ప్రజారోగ్య సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొనగలరని.. అమెరికన్‌ ఓటర్లలో సగంకంటే ఎక్కువమంది భావిస్తున్నట్లు ప్యూ రిసెర్చ్‌ పరిశోధనలో తేల్చింది. దేశాన్ని ఏకం చేయడంలో బైడెన్‌ 20 శాతం ఎక్కువ ప్రజాభిమానాన్ని సాధించారని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news