తెల్ల బియ్యంతో ఆరోగ్యానికి ఎంత ముప్పో తెలుసా?

-

దక్షిణ భారతదేశంలోని ప్రజలు ప్రధానంగా తీసుకొనే ఆహారం అన్నము. అన్నం కాకుండా ఏది తిన్నా.. ఎంత తిన్న సంతృప్తిని ఇవ్వదు. చివరకు అన్నమే తృప్తిగా తింటూ ఉంటారు. మరి ఈ బియ్యం( పాలిష్ ఎక్కువగా ఉన్న బియ్యం లేదా తెల్ల బియ్యం)తో చేసిన అన్నంను ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. తెల్ల బియ్యం తినడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం.

తెల్ల బియ్యం అన్నం చూడగానే తెల్లగా, నోట్లో పెట్టుకోగానే మెత్తగా ఉంటుంది. ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాలలో ఈ తెల్ల బియ్యంని ఆహార వనరుగా వాడుతూ ఉంటారు కొందరు మూడు పూటలా ఈ బియ్యంతో చేసిన అన్నంను తీసుకోవడం జరుగుతుంది.

తెల్ల బియ్యంను ఎక్కువగా పాలిష్ చేయడం ద్వారా తెల్లగా చూడగానే తినాలనిపిస్తుంది. కానీ ఇందులో ఉన్న ఫైబర్లు, న్యూట్రియంట్స్, విటమిన్లు పూర్తిస్థాయిలో తగ్గిపోతాయి. మరి అలాంటి బియ్యాన్ని తినడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

తెల్ల బియ్యంలో అధికంగా ఫైబర్ లేకపోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. మనం తిన్న ఆహారం జీర్ణంకాకపొగ ఆకలిని తగ్గిస్తుంది. అంతే కాకుండా మలబద్దకం సమస్యలు ఎక్కువగా వస్తాయి.

తెల్ల బియ్యంలో కార్బోహైడ్రేట్ల శాతం అధికంగా ఉంటుంది. ఈ బియ్యం తినడం వల్ల అధికంగా బరువు పెరుగుతారు. అంతేకాకుండా ఈ బియ్యం తినడం వల్ల స్టార్చ్ కంటెంట్ తగ్గి షుగర్ లెవల్స్ ను అధికంగా చేస్తుంది. తెల్ల బియ్యం తినడం వల్ల శరీరానికి కావలసిన అన్ని పోషకాలు అందవు.

బియ్యం ఎక్కువ పాలిష్ చేయడం వల్ల పాలిష్ దానిపై పొరలో ఉండే విటమిన్ బి మొత్తం తొలగిపోతుంది. శరీరానికి బలం ఇచ్చే విటమిన్-బి లేకపోవడం వల్ల తొందరగా అలసిపోవడం, ఒత్తిడికి లోనవడం, కండరాలు నొప్పులు వంటి సమస్యలు అధికమవుతాయి.

మధుమేహంతో బాధపడేవారు ఈ బియ్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల తీవ్ర సమస్యలతో బాధపడతారు. వీలయినంత వరకు తెల్ల బియ్యం కన్నా బ్రౌన్ రైస్ ఎక్కువ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news